తమిళనాడు గవర్నర్ గా ఏపీ బీజేపీ ముఖ్య నేత, ఏరి కోరి..!?

కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన తో పాటుగా కొత్త గవర్నర్ల నియామకాలు పూర్తి చేయనున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సిద్దం అవుతున్నారు. కాగా, కొత్త గవర్నర్ గా ఏపీ బీజేపీ ముఖ్య నేత పేరు ఖరారైనట్లు సమాచారం. దక్షిణాదిన కీలకంగా మారుతున్న తమిళనాడు బాధ్యతలు ఆయనకు అప్పగించాలని కేంద్రం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తుది కసరత్తు కొనసాగుతోంది.

కేంద్రం కీలక నియామకాల దిశగా నిర్ణయాలను సిద్దం చేస్తోంది. ప్రధాని మోదీ సెప్టెంబరు 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుక్రవారం మోదీ ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ల పర్యటన ప్రారంభవుతుంది. ఆయన తిరిగి వచ్చిన అనంతరం అధికార యంత్రాంగంలో మార్పులతోపాటు గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం జరుగనుంది. మోదీ ప్రభుత్వంలో 69 మంది మంత్రులుండగా, రాజ్యాంగం ప్రకారం మరో 12 మందిని నియమించుకునేందుకు అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, 70 ఏళ్ల వయసు దాటిన 12 మందికి పైగా క్యాబినెట్‌, సహాయమంత్రులను తప్పించి యువతకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఏపీ నుంచి టీడీపీ- జనసేన నుంచి ఒకరికి కొత్తగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

 మోదీ కేబినెట్ లోకి మరో టీడీపీ ఎంపీ, ఆయనకే ఫిక్స్ - తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
మోదీ కేబినెట్ లోకి మరో టీడీపీ ఎంపీ, ఆయనకే ఫిక్స్ - తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
union-govt-reportedly-considering-new-governor-appointments-for-five-states-next-week-former-cm-kir

త్వరలో అధికారిక నిర్ణయం..?

ఇక, తెలంగాణ నుంచి మరో ఇద్దరికి కేంద్ర మంత్రులుగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. కాగా.. తాజాగా అయిదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియామకం పైన దాదాపు నిర్ణయం జరిగింది. అందు లో భాగంగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం.. బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఖాయమైంది. ఆయన కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసారు. అసెంబ్లీలో విప్, స్పీకర్ గా పని చేసి రాష్ట్ర విభజన ముందు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తరువాత బీజేపీ లో చేరారు. 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కు కిరణ్ కు బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పూర్తి స్థాయి కేరళ గవర్నర్‌గా ఉంటూనే, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ విధులను అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఈ నియామకం పైన త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+