జగన్ డిమాండ్‌పై యుద్ధ ప్రాతిపదికన స్పందించిన కేంద్రం: రంగంలో దిగిన హోం: సీఎస్‌లతో భేటీ
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న విభజన అంశాలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న వారం రోజుల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఇతరత్రా పంపకాలపై తక్షణ చర్యలను తీసుకోవాలంటూ తన పర్యటన సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు.
దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. దాని ఫలితం కూడా ఇప్పుడు కనిపిస్తోంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత పూర్తి కావాల్సిన పంపకాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా.. ఈ ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కార్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సమీర్ శర్మ, సోమేష్ కుమార్ ఇందులో పాల్గొన్నారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయం అధికారులు దీనికి హాజరయ్యారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచన అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చ సాగింది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లో ఇప్పటికీ ఉమ్మడిగా కొనసాగుతున్న కార్పొరేషన్ల విభజనపై ప్రధానంగా ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, విజయ డెయిరీ వంటివి ఇంకా ఉమ్మడిగానే ఉన్నాయి. వాటి ఆస్తులు, స్థలాల పంపకాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది.

వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధానంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అజయ్ కుమార్ భల్లా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలు.. ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి వాదిస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని అటార్నీ జనరల్ సైతం అభిప్రాయ పడిన నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ కూడా దీని వైపే మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
Recommended Video
తెలంగాణలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఏపీ వాటాగా 7,500 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను సైతం ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై కూడా తెలంగాణ అధికారులు హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications