Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీకి కేంద్రం వరాలు..!!

ఏపీ తీర ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ద్రష్టి సారించింది. అత్యంత సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రానికి వరాలను ఇవ్వడానికి సన్నద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఓ నివేదికను సిద్ధం చేయాలంటూ సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది.

ఏపీ తీర ప్రాంతాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, రవాణా, మత్స్యకార గ్రామాల సమగ్రాభివృద్ధి, శ్రీకాకుళం మొదలుకుని నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతాలన్నింటినీ అనుసంధానిస్తూ రోడ్ కనెక్టివిటీని కల్పించడం.. వంటి అంశాలను ఈ నివేదికలో పొందుపర్చే అవకాశాలు ఉన్నాయి.

Union Ministers K Ram Mohan Naidu and Sarbananda Sonowal held a meeting

ఏపీని దేశ సముద్రావృద్ధికి ముఖద్వారంగా మార్చడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సొనొవాల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. నేడు ఢిల్లీలో శర్బానంద సొనొవాల్ తో సమావేశం అయ్యారు. ఏపీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. పలు అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి.

ప్రత్యేకించి- శ్రీకాకుళం జిల్లాలో పోర్టులు, దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఇప్పుడున్న కనెక్టివిటీని మరింత మెరుగుపర్చడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై మాట్లాడారు. పోర్టుల అభివృద్ధి ద్వారా ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని ఈ సందర్భంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉప్పు భూములను గుర్తించడం, వాటిని వినియోగించుకోవడం, వ్యూహాత్మక- మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకంగా మారుతుందని చెప్పారు. 974 కిలో మీటర్ల తీరప్రాంతం, 42 లక్షల మందికి పైగా ఉన్న మత్స్యకారులు ఏపీ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తోన్నారని అన్నారు. అత్యంత సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీని ప్రత్యేకంగా నిలిపిందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+