ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన, అసెంబ్లీరద్దుపై కిరణ్: టిజి

సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఒక్కటయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాం రావాలని కోరుకుంటారని, కాంగ్రెసు నాయకత్వంలో రావడం ఆయనకు ఇష్టం ఉండదన్నారు. తనకు కెసిఆర్ పైన నమ్మకముందని, ఆయన బతికుండగా తెలంగాణ రాదన్నారు. అవసరమైతే సెలైన్ ఎక్కించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
తెలంగాణకు అనుకూలంగా ఉన్న వారందరూ తమకు శత్రువులే అన్నారు. విభజన ఏర్పాటు ప్రక్రియకు స్పీడ్ బ్రేకులు వేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విభజనకు వ్యతిరేకంగా కేంద్రమంత్రులు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారన్నారు. అవసరమైతే రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వచ్చినా ఫలితం ఏమీ ఉండదన్నారు. ఆయన రాకుంటేనే మంచిదని, వస్తే ఇంకా సీమాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టినట్లవుతుందన్నారు. ఉద్యమం మరింత బలపడుతుందన్నారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఆయననే అడగాలన్నారు.
సమైక్యాంధ్ర కోసం తమవంతు పోరాటం తాము చేస్తున్నామన్నారు. పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయక పోవడం వల్ల ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి పోరాడుతున్నారని కితాబిచ్చారు. మరో మూడు నెలల పదవి కోసం ఎవరు చూడటం లేదని, సమైక్యాంధ్ర కోసమే ఆలోచిస్తున్నారన్నారు. తాను పార్టీలో ఉన్నంత వరకు పార్టీని విమర్శించనని, స్వేచ్ఛను హరిస్తే మాత్రం బయటకు వస్తానని చెప్పారు. గెలుస్తామనే నమ్మకం ఉంటే ఎవరైనా పార్టీ పెడతారని చెప్పారు.












Click it and Unblock the Notifications