కావూరి ఇంటి ముట్టడి: విద్యార్థుల్ని పంపించాలని ధర్నా

ఉద్యమంలోకి విద్యార్థుల్ని పంపించాలని ధర్నా
సమైక్యాంధ్ర ఉద్యమంలోకి విద్యార్థులను పంపించాలని విశాఖలోని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద పలువురు సమైక్యవాదులు ఆందోళన చేశారు. సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్న అవంతి శ్రీనివాస్ తమ కళాశాలను మాత్రం మూసివేయడం లేదని, విద్యార్థులను ఉద్యమంలోకి పంపించడం లేదన్నారు. విద్యార్థులను వెంటనే ఉద్యమంలోకి పంపాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గత కొంతకాలంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. సమైక్యాంధ్ర కోసం ఆయన ఆమరణ దీక్షకు కూడా కూర్చున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అప్పటి నుండి అతను జివిఎంసి వద్ద కాంగ్రెసు చేస్తున్న రిలే దీక్షల్లో పాల్గొంటున్నారు.
ఉషారాణి ఇల్లు ముట్టడి
సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో గురువారం పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి రాజీనామాకు పట్టుబట్టారు. ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశానని, సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications