యువతి కిడ్నాప్ డ్రామా పేరుతో ఇద్దరు పోలీసుల హత్య!

ఆదివారం సాయంత్రం పలమనేరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జవహర్ నాయక్ (28), హోంగార్డు దేవేంద్ర కుమార్ (23)కు మహేష్ విషయం చెప్పాడు. దీంతో వారిద్దరూ గాంధీనగర్ చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు వీరిద్దరినీ దారుణంగా కత్తులతో పొడిచి హత్యచేశారు.
సోమవారం ఉదయం అడవికి వెళ్ళిన పశువుల కాపరులు పోలీసుల మృతదేహాలు చూసి సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హోంగార్డు దేవేంద్ర కుమార్ చేతిపై ఆటో నెంబరు కనుగొన్నారు. రాయలసీమ రేంజి డిఐజి బాలకృష్ణ, ఎస్పీ రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తునకు ఆదేశించారు.
సంఘటన స్థలాన్ని వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్ పరిశీలించాయి. సమాచారం అందించిన గంగవరం కానిస్టేబుల్ మహేష్‌నూ విచారిస్తున్నారు. హత్యకు గురైన హోంగార్డు దేవేంద్ర కుమార్ చేతిలోని ఆటోనెంబరు ఆధారంగా పలమనేరు పట్టణానికి చెందిన ముబారక్ అనే వ్యక్తి వాహనంగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలం నుంచి మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications