అకాల వర్షం ఇరుప్రాంతాల్లో నిండా ముంచింది (పిక్చర్స్)
హైదరాబాద్/రాజమండ్రి: అకాలవర్షాలు అటు తెలంగాణ.. ఇటు కోస్తా రైతులను నిలువునా ముంచేశాయి. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలు తెలంగాణ రైతును కుంగదీస్తే, శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షాలు కోస్తా రైతుల ఆశలను ఆవిరి చేశాయి.
అకాలంలో కురిసిన కుండపోతతో కోస్తా రైతన్నల గుండె చెరువైంది. శ్రీకాకుళం మొదలు గుంటూరు వరకు అన్నదాతల ఆశలను అకాలవర్షాలు నీటిపాలు చేశాయి. నట్టింట సిరులు కురిపించాల్సిన వరి నీటిలో తేలుతుంటే రైతన్నల గుండెలు ట్టుకోలేకపోతున్నాయి.
ఆరుగాలం పడిన శ్రమ అకాల వర్షం పాలైందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరొందిన ఉభయ గోదావరి రైతులను వరణుడు కోలుకోలేని దెబ్బ తీశాడు.

శుక్రవారం రాత్రి నుంచి శనివారం
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన కుండపోతతో వరి, మామిడి, అరటి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా
ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మే మాసంలో 10 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

శనివారం ఉదయానికి
అత్యధికంగా కాజులూరులో 18 సెంటీ మీటర్లు, తాడేపల్లి గూడెంలో 17.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది.

ఉభయ గోదావరి జిల్లాల్లో
సుమారు 3 లక్షల హెక్టార్లలో రబీ సాగు కాగా, సగం మేర కోతలు పూర్తయ్యాయి. సుమారు 80 వేల హెక్టార్లలో వరి రాశుల మీద ఉంది. మరో 40వేల హెక్టార్లలో వరి పనల మీద ఉండగా, 30వేల హెక్టార్లలో కోతకు సిద్ధంగా ఉంది.












Click it and Unblock the Notifications