లోకేష్, బాలకృష్ణ ఎదుట భువనేశ్వరికి 'ఐ లవ్‌యూ' చెప్పిన చంద్రబాబు?
కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 కార్యక్రమం రెండో సీజన్ ప్రారంభమైంది. మొదటి సీజన్ లో మహేష్‌బాబు, మోహన్‌బాబు, పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, నాని, రానా దగ్గుబాటి తదితరులను బాలయ్య ఇంటర్వ్యూ చేశారు. తాజాగా సీజన్-2లో మొదటి కార్యక్రమం ఈనెల 14వ తేదీ శుక్రవారం ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను 'ఆహా' విడుదల చేసింది. ఇప్పటివరకు సినీ పరిశ్రమకు సంబంధించినవారిని గెస్ట్ లుగా పిలిచి ఇంటర్వ్యూ చేసిన బాలకృష్ణ తొలిసారిగా తనకు బావ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుణ్ని గెస్ట్ గా ఆహ్వానించారు. కార్యక్రమం మధ్యలో బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా హాజరై సందడి చేశారు. బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలివ్వడంతోపాటు వ్యక్తిగతమైన విషయాలు, వృత్తిపరమైన విషయాలను కూడా పంచుకున్నారు.

నా బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి
మాజీ
ముఖ్యమంత్రి
డాక్టర్
వైఎస్
రాజశేఖర్‌రెడ్డితో
కలిసి
తాను
బాగా
తిరిగేవాడినని
ఆనాటి
జ్ఞాపకాలను
బాబు
గుర్తు
చేసుకున్నా.
'మీ
జీవితంలో
మీరు
చేసిన
రొమాంటిక్
పనేంటి?'
అని
బాలకృష్ణ
అడగ్గా
'మీరు
సినిమాల్లో
చేశారు..
నేను
స్టూడెంట్‌గా
చేశాను
'
అంటూ
చంద్రబాబు
ఇచ్చిన
సమాధానం
నవ్వులు
పూయించింది.
అమ్మాయిలు
కనపడితే
బైక్
సైలెన్సర్
తీసేవాడినని
తెలిపారు.
'మీ
బెస్ట్
ఫ్రెండ్
ఎవరు?'
అని
అడిగిన
ప్రశ్నకు
రాజశేఖర్‌రెడ్డి
అని
సమాధానమిచ్చారు.
'ఆ
రోజు
మనం
తీసుకున్న
నిర్ణయం
తప్పా?
కాళ్లు
పట్టుకుని
అడిగాను
'
అని
చంద్రబాబు
సీరియస్‌గా
మాట్లాడారు.
ఆ
తర్వాత
లోకేష్
రావడంతో
మళ్లీ
సందడి
నెలకొంది.
లోకేష్
కొద్దిసేపు
హోస్ట్‌గా
మారి
బాలకృష్ణ,
చంద్రబాబు
నుంచి
ఆసక్తికర
విషయాలను
రాబట్టారు.

మీ అందరి బంధువు.. నాకు బావగారు..
కార్యక్రమం
ప్రారంభంలో
బాలకృష్ణ
ప్రేక్షులతో
మాట్లాడుతూ
''తన
బంధువులను
ఇంటర్వ్యూకు
ఆహ్వానిద్దామని
అనుకున్నానని,
కానీ
మీ
అందరికీ
బంధువు,
తనకు
బావగారు
అయిన
బాబుగారిని
పిలుస్తానంటూ''
ఉత్కంఠ
రేపారు.
బాబు
వచ్చిన
తర్వాత
''తనకు
రెండు
ఫ్యామీలున్నాయని,
ఒకటి
జూబ్లీహిల్స్
లో
ఉంటే
రెండో
ఫ్యామిలీ
ఆహా
అని,
గతేడాదే
ప్రారంభించినప్పటికీ
ప్రజలతో
విడదీయరాని
అనుబంధం
ఏర్పడిందన్నారు''.
వెంటనే
చంద్రబాబు
ఫోన్
తీసి
'వసూకు
కూడా
చెబుదాం..
ఇది
బ్రేకింగ్
న్యూస్'
అంటూ
ఛలోక్తి
విసిరారు.

భువనేశ్వరికి ఫోన్ చేసిన చంద్రబాబు
చంద్రబాబుచేత
భువనేశ్వరికి
ఫోన్
చేయించి
ఇక్కడున్న
అందరి
సాక్షిగా,
వీడియో
చూస్తున్నవారందరి
సాక్షిగా
తన
చెల్లెలకు
'ఐలవ్యూ'
చెప్పాలన్నారు.
బాబు
భువనేశ్వరికి
ఫోన్
చేసి
''నేను
మీ
బాలకృష్ణగారి
చేతుల్లో
ఇరుక్కుపోయానన్నారు''.
లోకేష్
వచ్చిన
తర్వాత
బాలకృష్ణ
''మీ
నాన్న
ఈ
గెటప్
కాకుండా
వేరే
గెటప్
లో
ఎప్పుడన్నా
కనిపించారా?''
అని
అడగ్గా..
''యూరప్
కు
వెళ్లినా
ఇట్లాగే
కనపడతారు..
మాల్దీవులకు
వెళ్లినా
ఇలాగే
కనపడతారని''
లోకేష్
బదులిచ్చారు.

కూతురినిచ్చిన మామకు లేని సందేహం నాకెందుకు?
మంగళగిరి
నుంచి
ఓడిపోవడానికి
కారణమేంటని
అడిగిన
బాలయ్యకు
''గెలవాలనే
సంకల్పంతో
అక్కడికి
వెళ్లానన్నారు''.
తర్వాత
లోకేష్
హోస్ట్
గా
మారి
బాలకృష్ణ,
చంద్రబాబును
ఉమ్మడిగా
ఇంటర్వ్యూ
చేశారు.
'ఇంట్లో
కుకింగ్
ఎవరు
చేస్తారనగా'
సలహాలిస్తానని
బాలకృష్ణ
బదులిచ్చారు.
''బావా..
నువ్వు
ఎప్పుడూ
మా
చెల్లెలకు
వండిపెట్టలేదా?''
అని
చంద్రబాబును
అడగ్గా..
''నేనే
వండుకోలేదు..
ఇంక
ఆమెకు
ఎక్కడ
వండిపెడతానని''
సమాధానమిచ్చారు.
ఇద్దరిలో
భార్య
మాట
ఎవరు
వింటారు?
అని
లోకేష్
అడగ్గా..
''పబ్లిక్
గా
చెప్పడానికి
నా
ఇగో
ఒప్పుకోవడంలేదని''
బాలకృష్ణ
అంటారు.
''తండ్రీ
కొడుకులిద్దరూ
నా
సంసారంలో
నిప్పులు
పోస్తున్నారంటూ''
లేచి
మళ్లీ
హోస్ట్
స్థానంలోకి
వెళతారు.
స్విమ్మింగ్
ఫూల్
లో
దిగిన
ఫొటోను
చూపించి
'అసెంబ్లీ
వరకు
ఈ
పొటో
వెళ్లిందని
ఈ
ఫొటో
మీద
నీ
స్పందనేంటి
బావా?'
అని
బాలకృష్ణ
అడగ్గా
''మామకు
లేని
సందేహం
నాకెందుకన్నారు''.