Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Unsung Hero : స్వాతంత్య్ర సమరయోధుడు...బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న...

ఉత్తరాంధ్ర నుంచి ఎగసిపడ్డ రాజకీయ కెరటం ఆయన... జీవితాంతం బలహీనవర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన పేదల ఆశాజ్యోతి ఆయన... దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి ఆయనే... ఆ రాజకీయ మహా శిఖరం సర్దార్ గౌతు లచ్చన్న... స్వాతంత్య్ర సమరయోధుడిగా,జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా,రాజకీయ నాయకుడిగా గౌతు లచ్చన్న సాగించిన ప్రయాణం ఆయన్ను మహనీయునిగా నిలబెట్టింది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఇలాంటి మహనీయులను తలుచుకుని ఆ స్పూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది.

సర్దార్ గౌతు లచ్చన్న ఆగస్టు 16,1909లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆనాటి గంజాం జిల్లా సోంపేట తాలుకాలో ఉన్న బారువా గ్రామంలో జన్మించారు. చిట్టయ్య-రాజమ్మ దంపతులకు ఆయన ఎనిమిదో సంతానం.ఆయన తండ్రి గౌడ వృత్తిలో ఉన్నప్పటికీ... తనలాగా తన కొడుకులు కూడా అదే వృత్తిలో ఉండిపోవద్దని వారిని బాగా చదివించాలనుకున్నాడు. బారువా ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు,ఆ తర్వాత శ్రీకాకుళం ఉన్నత పాఠశాలలో గౌతు లచ్చన్న విద్యాభ్యాసం సాగింది.

unsung heroes freedom fighter sardar goutu latchannas life journey

శ్రీకాకుళం ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలోనే ఆయన జాతీయత భావాలను ఏర్పరుచుకున్నారు. నర్సింహ మూర్తి అనే మాష్టారు ఆయనకు మార్గదర్శిగా ఉండేవారు. మెట్రిక్యులేషన్ చదవుతుండగానే గాంధీ పిలుపు మేరకు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం,విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో అరెస్టయి కొన్నాళ్లు టెక్కలి,బరంపురంలలో జైలు జీవితం గడిపారు. 1932లో శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొని 5 నెలలు రాజమండ్రి జైల్లో ఉన్నారు. గాంధీ పిలుపు మేరకు హరిజన సేవ సంఘాలను ఏర్పాటు చేసి హరిజన రక్షణ యాత్రలు చేపట్టారు. అంటరాని తనాన్ని దూరం చేసేందుకు హరిజనులను ఆలయ ప్రవేశం చేయించారు. రాత్రిపూట బడులు నిర్వహించి బడుగు,బలహీనవర్గాలకు విద్యను బోధించారు.

1930లో మందసా నుంచి మద్రాసు వరకు రైతు చైతన్య కూలీ యాత్రను చేపట్టారు. నిడుబ్రోలులో ఆచార్య రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో చేరారు. అక్కడ విద్యాభ్యాసం అనంతరం జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు చేపట్టారు. 1935లో కాంగ్రెస్ సోషల్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాష్ట్రంలో ఎన్నో రైతు ఉద్యమాలు నడిపారు. 1940లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయిన గౌతు లచ్చన్న... మూడేళ్లు జైలు జీవితం గడిపారు.1947లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1950లో ఆచార్య కృషికార్ లోక్ పార్టీలో ప్రధాన పాత్ర పోషించారు. 1953,అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాస్ నుంచి రావాల్సిన ఆస్తుల పంపకాలను పరిశీలించిన సభ్యుల్లో లచ్చన్న ఒకరు.

Recommended Video

    Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu

    ప్రకాశం పంతులు మంత్రివర్గంలో,బెజవాడ గోపాలంరెడ్డి మంత్రివర్గంలో గౌతు లచ్చన్న మంత్రిగా పనిచేశారు. 1961లో రాజాజీ ఏర్పాటు చేసిన పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.1978లో ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. కొంతకాలం బహుజన పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా బలహీనవర్గాల కోసం పనిచేశారు.ఏప్రిల్ 6,2009న కన్నుమూశారు. గౌతు లచ్చన్న కార్యదక్షత,ఉక్కు సంకల్పం వల్లే ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+