అమరావతిలో కలకలం: మద్యం, డ్రగ్స్, బహిరంగ శృంగార కార్యకలాపాలు!

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతుంటే.. మరోవైపు మరో వైపు అక్కడ జరుగుతున్న అశ్లీల కార్యకలాపాలు స్థానిక ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. 

ఇలాంటి కార్యకలాపాలు నూతన రాజధానికి చెడ్డ పేరు తీసుకొస్తాయని, వెంటనే వీటిని అరికట్టాలని కోరుతున్నారు.

మద్యం, డ్రగ్స్.. బహిరంగంగానే..

మద్యం, డ్రగ్స్.. బహిరంగంగానే..

అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో పంట పొలాలు ఖాళీగా ఉండటంతో, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి రాత్రుళ్లు ఇక్కడకు చేరుతున్న యువత శ్రుతిమించుతోంది. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో తూగుతూ, బహిరంగ శృంగారానికి పాల్పడుతూ.. అడిగిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu Naidu Suggests To Protect Telugu language | Andhra pradesh |
యువతీయువకుల వీరంగం

యువతీయువకుల వీరంగం

ఇటీవల తాడేపల్లి ప్రాంతానికి కొందరు యువకులు, ఓ యువతిని తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఓ కానిస్టేబుల్ అడ్డుకోబోయాడు. అయితే, సదరు యువతి రేప్ చేయబోయావంటూ ఫిర్యాదు చేస్తానని బెదిరించింది పోలీసునే బెదిరించడం గమనార్హం. దీంతో ఆ కానిస్టేబుల్ గ్రామంలోకి వెళ్లి స్థానికులను వెంటబెట్టుకుని వచ్చి వారికి బుద్ధి చెప్పి పంపించాల్సి వచ్చింది.

దాడికి దిగుతున్నారు..

దాడికి దిగుతున్నారు..

మరో ఘటనలో ఓ అమ్మాయిని తీసుకు వచ్చిన నలుగురు యువకులు మెల్లెంపూడి - గుండిమెడ రోడ్డపై గంజాయి తాగుతుండగా, స్థానికుడొకరు వెళ్లిపోవాలని సూచించగా.. అమ్మాయిని తొలుత పంపేసిన వారు, ఆపై రైతుపై దాడి చేసి పారిపోయారు.

స్థానికుల ఆందోళన

స్థానికుల ఆందోళన

ఉండవల్లి గుహల నుంచి సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో మద్యం మత్తులో రోడ్డుపై బహిరంగ శృంగారం చేస్తున్న యువతీ, యువకుడిని సీఎం విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీసు సిబ్బంది గట్టిగా మందలించి పంపాల్సి వచ్చింది. ఇక ఇక్కడ జరిగే పార్టీల్లో గొడవలు జరుగుతున్నాయని, బ్యాచ్‌లుగా యువత విడిపోయి కొట్టుకుంటున్నారని, వారి వైఖరితో తాము భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు చెబుతున్నారు.

కట్టడి చేయాల్సిందే..

కట్టడి చేయాల్సిందే..

ముఖ్యంగా మంగళగిరి-కృష్ణాయపాలెం రోడ్డు, ఉండవల్లి-అమరావతి, కరకట్ట నుంచి రాయపూడి వరకు రాత్రి పూట ఆడా, మగా తేడా లేకుండా పార్టీలు జరుపుకుంటున్న పరిస్థితులు తరచూ కనిపిస్తుండటంతో స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. వెంటనే ప్రభుత్వం ఈ కార్యకలాపాలను కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Unusual activities held in Andhra Pradesh new capital area amaravati.
Please Wait while comments are loading...