జగన్ సర్కార్‌కు మరో ఘనత.. వైట్ హౌస్ కు రావాలని .. ఏపీ స్కూల్స్ విద్యార్ధులకు యూఎస్ ఆహ్వానం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో అరుదైన అవకాశం లభించింది. ఇప్పటికే విదేశాలలో అంతర్జాతీయ మేధావుల దృష్టిని ఆకర్షించిన ఏపీ బడి పిల్లలు ఇప్పుడు మరో అంతర్జాతీయ ఆహ్వానాన్ని దక్కించుకున్నారు. 2024 మార్చి 5వ తేదీన అమెరికాలో జరగనున్న నానో టెక్నాలజీ సదస్సుకు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఆహ్వానం అందింది.

ఈ సదస్సులో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాములతో పాటుగా, అమెరికా అధ్యక్షుడు బయటకు సలహాదారు భారత సంతతికి చెందిన ఆర్తి ప్రభాకర్ తో కలిసి మన విద్యార్థులు ఆ వేదికపై మాట్లాడే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపైన విద్య, వైద్యం, ఉత్పత్తి, తయారీ రంగం, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్ వంటి అనేక అంశాల పైన ఏపీ విద్యార్థులు ప్రసంగిస్తారు.

US invites students of AP schools to come to the White House and the nano technology summit

ఇప్పటికే ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించి దేశ విదేశాల విద్యావేత్తల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మరొక మారు అమెరికా వేదికగా తమ సత్తా చాటడానికి ఈ సదస్సుకు రెడీ అవుతున్నారు. గత సెప్టెంబర్లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

US invites students of AP schools to come to the White House and the nano technology summit

15 రోజులపాటు కొలంబియా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లతోపాటు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకు సందర్శించి ఆయా దేశాలలో పాలన విధానం వంటి అంశాల మీద అవగాహన పెంపొందించుకున్నారు. అంతేకాదు ఏపీలో విద్యావ్యవస్థలో వచ్చిన సంస్కరణలు, విద్యా ప్రగతి కోసం ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను ఏపీ వివిధ పాఠశాలల పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు.

US invites students of AP schools to come to the White House and the nano technology summit

ఇప్పుడు మరో మారు యూఎస్ వెళ్లనున్న నేపథ్యంలో విద్యావ్యవస్థలో జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి అన్న చర్చ జరుగుతుంది. వచ్చే ఏడాది జరగనున్న సదస్సుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా రెడీ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+