అశ్వగంధ..చ్యవన్‌ప్రాశ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత ఏం చేయాలంటే? కేంద్రం కొత్త చిట్కాలు
న్యూఢిల్లీ: దేశంలోొ కరోనా వైరస్ రోజురోజుకూ చెలరేగిపోతోంది. వేల సంఖ్యలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. లక్షకు చేరువగా వెళ్లాయి. దేశవ్యాప్తంగా తొమ్మిదిన్నర లక్షలమందికి పైగా కరోనా పేషెంట్లు ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. 35 లక్షల మందికి పైగా దీని బారిన పడి కోలుకున్నారు. ఆరోగ్యంతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. కరోనా బారిన పడి కోలుకొన్న అనంతరం చాలామంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, కరోనా ప్రభావం నుంచి పూర్తిగా బయటపడటంలో ఇబ్బందులను గురవుతున్నారని కేంద్రం భావిస్తోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అవసరమైన సూచనలను చేస్తూ తాజాగా కోవిడ్-19 ప్రొటోకాల్‌ను విడుదల చేసింది. కొన్ని ప్రాధాన్యత గల సూచనలను ఇందులో పొందుపరిచింది. అశ్వగంధ, చ్యవన్‌ప్రాశ్‌ను క్రమం తప్పకుండా సేవించాల్సి ఉంటుందని సూచించింది. పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగాసనాలను వేయడం, ప్రాణాయామం చేయడం వంటి చర్యలను రోజూ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మంచినీటిని వీలైనంత ఎక్కువగా తాగాలని సూచించింది.

డాక్టర్ల సలహా మేరకు శ్వాసకోశానికి సంబంధించిన వ్యాయామాలను చేయడం తప్పనిసరిగా పేర్కొంది. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులకు గురి చేయడం కరోనా వైరస్ ప్రభావాల్లో ఒకటి. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా నిర్లక్ష్యం చేయొద్దని కేంద్రం సూచించింది. శ్వాసకోశ వ్యాయామాలను చేయడం ద్వారా కరోనా వల్ల దెబ్బతిన్న ఈ వ్యవస్థను సరిదిద్దుకోవచ్చని పేర్కొంది. సమతుల్య పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించింది. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇంట్లోనే ఉంటూ శరీర ఉష్ణోగ్రతను తరచూ పరీక్షించుకోవాలని, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
Recommended Video
ఆయుష్ ఖ్వాత్-150 మిల్లీలీటర్లు లేదా ఒక కప్పు రోజూ తీసుకోవాలని సూచించింది. 500 మిల్లీ గ్రాముల శంషామనివాటీ లేదా మూడు గ్రాముల గిలోయ్ పౌడర్‌ను 15 రోజుల పాటువేడినీటిలో రోజూ రెండుపూటలా స్వీకరించాలని పేర్కొంది. ఒక గ్రాము అశ్వగంధను రోజూ తినాలనీ సూచించింది. రోజుకు ఒకసారైనా ఒక ఊసిరికాయ లేదా మూడు గ్రాముల మేర ఊసిరికాయ పౌడర్‌ను తీసుకోవాలని కేంద్రం తన కొత్త ప్రొటోకాల్‌లోొ పొందుపరిచింది. ఒక టీ స్పూన్ చ్యవన్‌ప్రాశ్‌ను ప్రతిరోజూ ఉదయం తినాలని, ములేతి పౌడర్‌ను వేడినీటిలో కలిపి తీసుకోవాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications