ఈ నీటితో ముఖం కడిగితే అందం విపరీతంగా పెరుగుతుంది..!
మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో బియ్యంనీరు ఎంతో దోహదపడుతుంది. ఇందులో విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల పోషకాలుంటాయి. జుట్టును, చర్మాన్ని మెరిసేలా చేయడంలో దీనికి ఇదే సాటి. చర్మానికి పోషణ అందించడంతో పాటు మొటిమలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. బియ్యం నీటిని ఉపయోగించే మార్గాల గురించి తెలుసుకుందాం.
బియ్యం నీరు-కలబంద.. అరకప్పు రైస్ వాటర్ తీసుకోవాలి. అందులో రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ ను బాగా కలపాలి. దాన్ని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లా చర్మానికి అప్లయ్ చేయాలి. అలాగే పావుగంట ఉంచాలి. అనంతరం సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మొటిమలను కూడా పోగొట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

బియ్యంనీరు, పసుపు.. అరకప్పు రైస్ వాటర్‌లో ఒక టీస్పూన్ పసుపు పొడిని కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. తర్వాత సాధారణ నీటితో కడుక్కోవాలి. ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి. బియ్యం నీటిలో ఆక్సిడెంట్లు ,విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అత్యంత ప్రభావవంతమైనది. ఇది ముఖంపై ఉండే మొటిమలను తొలగించి, చర్మానికి మెరుపు తెస్తుంది.
బియ్యం నీళ్లలో అర చెక్క నిమ్మకాయ రసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి శుభ్రంగా పట్టించి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మాన్ని ఇది మెరిసేలా చేస్తుంది. టానింగ్ ,సన్ బర్న్ వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. బియ్యాన్ని నీటిలో నానబెట్టడంద్వారా చర్మానికి ఎంతో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం కూడా పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications