ఛీటింగ్ లో నయా ట్రెండ్...గర్భసంచులు కొంటామని మహిళలకు కిలాడి లేడీ టోకరా...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విజయనగరం: ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనే స్లోగన్ నేరస్తులే బాగా వంటబట్టించుకున్నట్ల కనిపిస్తోంది కొందరు ఛీటర్ల వ్యవహారం చూస్తే...అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి ఒక్కో కిలాడీ అనుసరించిన విధానం చూస్తే అసలు వీళ్లకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయా అని ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇంతకీ విషయమేమిటంటే...

విజయంనగరం జిల్లాలో ఒక మాయలేడి వినూత్నఐడియాతో స్థానిక మహిళలను దారుణంగా మోసగించి వాళ్ల అమాయకత్వాన్నిఫుల్లుగా క్యాష్ చేసుకుంది. గర్భసంచులు కొంటామని ఎరవేసి లక్షల రూపాయల పేరు చెప్పి ఆశల పల్లకీలో ఊరేగించి చివరకు నిలువునా మోసగించి పరారైంది...వివరాల్లోకి వెళితే గర్భసంచి ఇస్తే రూ.8 లక్షలు ఇస్తామంటూ ఓ మహిళ మోసానికి పాల్పడిన ఘటన విజయనగరంలో సంచలనం సృష్టించింది. గర్భ సంచి తీసుకునేందుకు టెస్ట్‌ల కోసమని ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 15 వేలు వసూలు చేసినట్లు బాధితులు లబోదిబో మంటున్నారు.

 గర్భ సంచి...కొంటాం...

గర్భ సంచి...కొంటాం...

విజయనగరంలో ఒక మహిళ చేసిన మోసం విస్తుగొలుపుతోంది. పాత సామాన్లు కొంటాం...పాత పుస్తకాలు కొంటాం అన్న చందంగా గర్భసంచి కొంటాం అంటూ మహిళలను మోసగించి సొమ్ము చేసుకున్న తీరు తెలిసి పోలీసులే నివ్వెరపోయారు. ఇంతకీ ఈ నయా చీటింగ్ కి పాల్పడిన కిలా(లే)డీ పేరు జ్యోతి...బాధితులు చెబుతున్న సమాచారాన్నిఈమెది భీమిలీ.

 మోసానికి పాల్పడింది ఇలా...

మోసానికి పాల్పడింది ఇలా...

అడ్డదారిలో డబ్బు సంపాదించాలని డిసైడయ్యాక సరికొత్త ఛీటింగ్ ఐడియాతో విజయనగరంలో అడుగుపెట్టింది ఈ జ్యోతి. ఆ తరువాత దిగువ మధ్యతరగతి మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకుంది. ఆ తరువాత తన మాయమాటల వల విసిరింది. ఇటీవలి కాలంలో విదేశాల్లో గర్భసంచులకు బోలెడు గిరాకీ పెరిగిందని, గర్భ సంచి దొరికితే ఎంతైనా పెట్టి కొనేందుకు దొరలు సిద్దంగా ఉన్నారని దొంగమాటలు చెప్పింది. ఆ తరువాత మీకు పిల్లలు పుట్టారు, ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారు. ఖాళీ పడి ఉండే గర్భసంచి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? దాన్ని అమ్మితే లక్షలకు లక్షలు వచ్చి పడతాయని నమ్మబలికింది.

 పడిపోయారు...సమర్పించుకున్నారు...

పడిపోయారు...సమర్పించుకున్నారు...

కిలాడి జ్యోతి మాటలకు విజయనగరం జిల్లా కేంద్రం కమ్మ వీధిలో కొంతమంది మహిళలు పడిపోయారు. గర్భసంచి ఇస్తే ఎనిమిది లక్షలు ఇస్తారన్నజ్యోతి మాటలకు ఆశ పడ్డ పలువురు మహిళలు ఆహా! గర్భసంచే కదా...ఇచ్చేస్తే లక్షలు వచ్చేస్తాయనుకొని సరే అన్నారు. ఆ విధంగా తమ కష్టాలు తొలగిపోతాయని ఆలోచించారు. అలా ఇక్కడ ఎనిమిదిమంది మహిళలు తమ గర్భసంచులు ఇవ్వడానికి ముందుకొచ్చారు.

ఆ తరువాత...మోసానికి తెరతీసింది...

ఆ తరువాత...మోసానికి తెరతీసింది...

అయితే గర్భ సంచి తీసుకోవాలంటే ముందు టెస్ట్‌లు చేయించుకోవాలని, ఆరోగ్యంగా ఉండి ఏ సమస్యలు లేనివాళ్ల గర్భ సంచులే పనికొస్తాయంటూ మరోమారు నమ్మబలికింది. ఇది నిజమేనని నమ్మిన ఈ మహిళలు టెస్ట్ ల కోసమని ఒక్కొక్కరు రూ.10 వేల నుంచి 15 వేలు ఈ కిలాడీ లేడీకి సమర్పించుకున్నట్లు బాధితులు చెబుతున్నారు.

 ఆషరేషన్ అంటూ...ఎస్కేప్...

ఆషరేషన్ అంటూ...ఎస్కేప్...

అలా వాళ్లందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన తరువాత త్వరలోనే ఆపరేషన్ అని, టెస్ట్ లు కూడా అక్కడే అప్పుడే చేస్తారని చెప్పింది. ఆపరేషన్ అయిపోవడంతోనే మీకు క్యాష్ పేమెంట్ జరుగుతుందని చెప్పింది. ఆ తరువాత ఆమె చెప్పిన డేట్ వచ్చింది. ఆపరేషన్ కి సిద్దమైన మహిళలు జ్యోతి కోసం ఫోన్ చేస్తే స్విఛ్చాఫ్...ఆమె అద్దెకుండే ఇంటి కెళ్లి చూస్తే ఖాళీ...దీంతో బాధితులకు అప్పటికి గానీ సీన్ అర్థం కాలేదు...వెంటనే మోసపోయామని లబోదిబో మంటూ పోలీస్‌ స్టేషన్‌కు పరిగెత్తారు. బాధితుల ఫిర్యాదు విని ముందు పోలీసులు అవాక్కయ్యారు. ఆ తరువాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఛీటింగ్లో నయా ట్రెండ్స్...

ఛీటింగ్లో నయా ట్రెండ్స్...

ఈమధ్య నేరగాళ్లు ఛీటింగ్ లో ఫాలో అవుతున్న నయా ట్రెండ్స్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు. జ్యోతి చేసిన మోసం విషయానికొస్తే అసలు
గర్భసంచి మార్పిడి ఇండియాలో అయితే లేనేలేదని, ఎక్కడైనా జరిగితే ప్రయోగదశలో మాత్రమే ఉన్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జ్యోతి గర్భ సంచి పేరుతో మాయమాటలు చెప్పి మోసానికి పాల్పడిందే తప్పఇలా గర్భసంచులను ఎవరూ కొనే అవకాశమే లేదని వారు తేల్చేస్తున్నారు. దీన్ని బట్టి జ్యోతి గర్భ సంచి పేరుతో వీరి దగ్గర నుంచి లక్షలు మోసం చేసినట్లు తేటతెల్లంఅయింది. అయితే ఇలా ఈ కిలాడీ లేడి కేవలం విజయనగరం కమ్మవీధిలో ఎనిమిదిమందిని మాత్రమేనా లేక ఇంక ఎక్కడెక్కడ ఎవరెవరిని మోసం చేసిందో తెలుసుకునేందుకు కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In Vizianagaram district, innocent local women has been cheated by fraudulent woman. The lakhs of rupees have been collected in the name of Uterus transplantation and ran away. The incident that took place in Vizianagaram district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి