ఉత్తమ్ భార్యపై కోడిగుడ్లతో దాడి, టిడిపి అభ్యర్థిపై రెబల్

కాంగ్రెస్, సిపిఎం కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. దాంతో సిపిఎం కార్యకర్తలు కోడిగుడ్లు, చెప్పులతో పద్మావతిపై దాడి చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో పద్మావతి నర్సింహులగూడెంలో ప్రచారాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయారు.
టిడిపి అభ్యర్థులపై రెబల్ అభ్యర్థుల దాడి
తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం టిడిపి అభ్యర్థులు తాత్కాలికంగా ఉపయోగిస్తున్న లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంపై టిడిపి రెబల్ అభ్యర్థి ఎస్‌విఎస్ఎస్ వర్మ అనుచరులను దాడి చేశారు. తమతో వాగ్వాదానికి దిగడంతో పాటు ఆఫీస్ ఫర్నీచర్, కారు అద్దాలు ధ్వంసం చేశారని టిడిపి అభ్యర్థి పోతుల విశ్వం వర్గీయులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
శ్రీవారిని దర్శించుకున్న కిరణ్
జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన కిరణ్ సోమవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications