వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐ ఎన్వీ రమణ కొత్త చిరునామా ఇదే - కుట్రలపై ఆవేదన : నేడే వారసుడి బాధ్యతలు..!!

|
Google Oneindia TeluguNews

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు. న్యాయవాదిగా.. న్యాయమూర్తిగా సుదీర్ఘ కాలం పని చేసిన జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ తరువాత తెలుగు రాష్ట్రాలకు తిరిగి వచ్చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఇక, నూతన సీజేఐ గా జస్టిస్ ఉదయ్ ఉమే లలిత్ ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి నూతన సీజేఐతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ లలిత్ భారత ప్రధాన న్యాయమూర్తిగా 74 రోజుల పాటు పదవిలో ఉండనున్నారు.

నేడే నూతన సీజేఐ బాధ్యతల స్వీకరణ

నేడే నూతన సీజేఐ బాధ్యతల స్వీకరణ

జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ లలిత్.. నవంబర్ 9, 1957న జన్మించారు. జూన్ 1983లో న్యాయవాది అయ్యారు. డిసెంబర్ 1985 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. జనవరి 1986లో ఆయన ఢిల్లీకి మకాం మార్చారు. 1986 నుండి 1992 వరకు, ఆయన మాజీ అటార్నీ జనరల్ సోలి జె సొరాబ్జీ వద్ద పనిచేశారు. 2014 ఆగస్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

లలిత్ తండ్రి ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ న్యాయవాది. లలిత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తరపున హాజరైనందున అయోధ్య రామమందిరం టైటిల్ దావా విచారణ నుంచి ఆయన తప్పుకున్నారు. ధనిక దేవాలయాలలో ఒకటైన కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని ట్రావెన్‌కోర్ పూర్వపు రాజకుటుంబం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన ధర్మాసనానికి ఆయన లీడ్ చేసారు.

ఢిల్లీ కేంద్రంగానే జస్టిస్ ఎన్వీ రమణ

ఢిల్లీ కేంద్రంగానే జస్టిస్ ఎన్వీ రమణ


ఇక, ఇప్పుడు మూడు ప్రాధాన్యతల ఆధారంగా తన 74 రోజుల సీజేఐ రోల్ కొనసాగుతుందని లలిత్ పేర్కొన్నారు. ఇక, పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎన్వీ రమణ తన కెరీర్ లో ఎదుర్కొన్న అనేక ఘటనలను తన వీడ్కోలు ప్రసంగంలో బయట పెట్టారు. న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అనేక కుట్ర పూరిత పరీక్షలు ఎదుర్కొన్నానని చెప్పారు.

వాటిని మౌనంగానే..ఎదుర్కొన్నామని ఆవేదనతో వివరించారు. సత్యమేమ జయతే అనే నమ్మకం తన విషయంలో జరిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పదవీ విరమణ చేసిన తరువాత జస్టిస్ ఎన్వీ రమణ తనకు ఇష్టమైన తెలుగు భాష కు సంబంధిచన రచనలు..పుస్తకాల కోసం సమయం కేటాయిస్తారంటూ వీడ్కోలు సభలో పలువురు ప్రముఖ న్యాయాధికారులు అభిప్రాయపడ్డారు. జస్టిస్ రమణ ఇప్పుడు పదవీ విరమణ తరువాత కొంత కాలం ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని నిర్ణయించారు.

త్వరలో ఆత్మీయ సమావేశం

త్వరలో ఆత్మీయ సమావేశం


దాదాపు ఏడాది కాలం ఆయన ఢిల్లోలో నే తన న్యాయవాద .. సాధారణ మిత్రులకు అందుబాటులో ఉంటనన్నారు. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తన పైన అభిమానం చూపిన వారికి ఎప్పుడూ దగ్గరగానే ఉండాలని భావిస్తున్నారు. తాను పదవీ విరమణ చేసినా..తన కుటుంబం తన కోసం ఉందని, తాను రిటైర్ అవుతున్నానే బాధ పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

దీంతో..జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీలోనే మరి కొంత కాలం కొనసాగించనున్నారు. త్వరలోనే హైదరాబాద్ కు రానున్న ఎన్వీ రమణతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖులు ఆలోచన చేస్తున్నారు. ఈ రోజు(ఆగస్టు 27) జస్టిస్ ఎన్వీ రమణ జన్మదినం. ఇదే రోజున ఆయన తన వారసుడిగా నూతన సీజేఐ లలిత్ కు బాధ్యతలను అప్పగించనున్నారు.

English summary
All set to Chief Justice of India-designate Uday Umesh Lalit to day at Rashtrpathi Bhavan. designate listed the three areas for his innings as the next CJI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X