లక్ష్మయ్యపై వద్దు, కెవిపిపై విచారణ చేస్తే మంచిది: విహెచ్
న్యూఢిల్లీ: రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను విమర్శించే బదులు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుపై విచారణకు ఆదేశించాలని టి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.
హనుమంతరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారంటూ నాయిని నరసింహారెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. వైఎస్‌ఆర్ హయాంలో పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసినా ఆయనకు అధికారాలు అంతంతమాత్రమే ఉండేవని ఆయన అన్నారు.

అసలు అధికారమంతా రామచంద్రరావు చేతిలోనే ఉండేవన్న సంగతి అందరికీ తెలిసిందేనని హనుమంతరావు చెప్పారు. లక్ష్మయ్యపై విచారణ జరిపిస్తే ఒరిగే లాభమేదీ ఉండదు, లక్ష్మయ్యకు బదులు రామచందర్‌రావుపై విచారణ జరిపిస్తే అసలు సంగతులు బయటపడతాయనేది నరసింహారెడ్డికి తెలియదా? అని ఆయన నిలదీశారు.












Click it and Unblock the Notifications