సత్యం రామలింగరాజు గ్రామంలో ఇంతదారుణమా?: బాబుపై వీహెచ్ ఫైర్
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు సాంఘిక బహిష్కరణ విషయంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గరగపర్రు పరిస్థితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
Recommended Video

లేదంటే కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీని తీసుకువచ్చి అక్కడి దళితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని చెప్పారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంతో పేరుగాంచిన సత్యం రామలింగరాజు సొంత గ్రామంలోనే దళితులను వెలివేయడం దారుణమని అన్నారు.

ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోందని వీహెచ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుందా? చంద్రబాబు భజన చేస్తోందా? అని విమర్శించారు.
తాను గరగపర్రు వెళ్లి దళితులతో మాట్లాడానని, వారికి కనీసం తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని వీహెచ్ తెలిపారు. తన సొంత ఖర్చులతో ఇవాళ బియ్యం తదితర నిత్యావసర వస్తువులను పంపుతున్నట్లు వీ హనుమంతరావు తెలిపారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications