Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో ఇది పరిస్థితి, ఐదు కిలోమీటర్ల క్యూ, దర్శనానికి ఎన్నిరోజులు అంటే ?, ఎఫెక్ట్ !

తిరుమల/తిరుపతి: తమిళ ప్రజలకు ఎంతో పవిత్రమైన పెరటాసి మాసంలోని రెండవ శనివారంతో పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి (tirupati), తిరుమలకు (Tirumala) వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి.అలిపిరి వద్ద వున్న పార్కింగ్ ప్రాంతాలన్నీ దాదాపుగా తమిళనాడు బస్సులతో, తమిళనాడు వాహనాలతో నిండిపోయాయి.తిరుపతిలోని (tirupati) అలిపిరి నుండి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చిన బస్సులతో నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి.తిరుమలలోని (Tirumala) వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి.

తిరుమలలో (Tirumala)క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ (TTD) ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. క్యూలెన్లు నిండిపోయి బయట ఐదు కిలోమీటర్ల పొడవునా క్లూ పెరిగిపోవడంతో శ్రీవారి భక్తులు ఎండలోనే వేచి ఉన్నారు.

Vaikuntham complex in Tirumala is full and queues have increased by five kilometers.

టీటీడీ (TTD) ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్లలో (Tirumala)వున్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ (TTD) సిబ్బంద అందిస్తున్నారు. దాదాపు 2, 500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు.

వైకుంఠం (Tirumala)కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లు, లగేజీ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాదం, రిసెప్షన్, కల్యాణకట్ట, ఆలయంలోపల క్యూ లైన్ల నిర్వహణ, చెప్పల్ స్టాండ్‌లు మొదలైన వాటి వద్ద వివిధ షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు. వివిధ శాఖలు యాత్రికుల (Tirumala)పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వేచి ఉన్న యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

Vaikuntham complex in Tirumala is full and queues have increased by five kilometers.

సెప్టెంబర్ 30వ తేదీ నాటికి శ్రీవేంకటేశ్వర స్వామి (Tirumala)దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. టీటీడీ (TTD) రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ఈ విషయమై తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో నిరంతరం ప్రకటనలు చేస్తోంది. దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తోంది.

కావున ఈ దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల (Tirumala) తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ (Tirumala) విజ్ఞప్తి చేస్తోంది. తమిళ ప్రజలకు ఈ పెరటాసి నెల చాలా పవిత్రమైనది, పెరటాసి నెల రెండో శనివారంతో పాటు ఆదివారం సెలవు, సోమవారం గాంధీ జయంతి సందర్బంగా సెలవు ఉండటంతో శుక్రవారం రాత్రే తమిళనాడులోని వివిద జిల్లాల నుంచి బయలుదేరిన శ్రీవారి (Tirumala)భక్తులు శనివారం వేకువ జామున నుంచి తిరుపతికి (tirupati)రావడం మొదలుపెట్టారు.

తిరుపతిలోని (tirupati) అలిపిరి నుంచి తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు క్యూలో తమిళనాడు బస్సులు పార్క్ చేశారంటే తిరుమలలో రద్దీ ఏరకంగా ఉందో అర్థం చేసుకోవవచ్చు. తిరుపతితో (tirupati) పాటు తిరుమలలోని అన్ని పార్కింగ్ ప్రాంతాలు వాహనాలతో నిండిపోయాయని శనివారం మద్యామ్నం టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+