TTD: తిరుమల భక్తులకు అలర్ట్, ముచ్చటగా మూడు కిలోమీటర్లు క్యూ, కొండ మీద వద్దంటే వాన
కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వేసవి సెలవులు కావడం, వీకెండ్ దెబ్బతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో పలు జిల్లాల్లోని అన్ని పార్టీల నాయకులు వీలు చూసుకుని ఏడుకొండలస్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకున్నారు.
వేసవి సెలవులు కావడంతో తిరుమలలో ఎటు చూసినా భక్తులు దర్శనం ఇస్తున్నారు. అనూహ్యంగా తిరుమల కొండ మీద భక్తులు పెరిగిపోవడంతో టీటీడీ అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. తిరుమలలో సామాన్య భక్తులు క్యూ కాంప్లెక్స్ ల ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమలలో ఇంకా రద్దీ ఎక్కువగా పెరిగిపోవడంతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునే సమయంలో ఇంకా ఎక్కువ గంటలు పట్టే అవకాశం ఉందని తెలిసింది

తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ లు నిండిపోయి క్యూ బయటకు వచ్చింది. క్యూకాంప్లెక్స్ లు నిండిపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయి క్యూ మూడు కిలోమీటర్ల పొడవు వచ్చింది. టోకన్లు లేకుండా సర్వదర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ఎప్పుడు దర్శనం అవుతుందో తెలీయడం లేదు. ఎన్ని గంటలు అయినా పర్వాలేదని, స్వామివారిని దర్శించుకుంటే చాలు అని భక్తులు అంటున్నారు.
క్యూకాంప్లెక్స్ లు నిండిపోయి క్యూలైన్లు బయటకు రావడంతో భక్తులు నానా ఇబ్బందిపడ్డారు శుక్రవారం తిరుమలలో భారీ వర్షం పడటంతో ఏడుకొండలు తడిచి ముద్ద అయ్యాయి. శుక్రవారం మద్యాహ్నం తిరుమలలో భారీ వర్షం పడటంతో శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలు తడిచిపోయాయి. శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులు లడ్డూలు తీసుకోవడానికి వెలుతున్న సమయంలో భారీ వర్షం పడటంతో భక్తులు తడిచి ముద్ద అయ్యారు.
దాదాపు రెండు గంటల పాటు తిరుమలలో గ్యాప్ లేకుండా వర్షం పడటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అయితే భారీ వర్షం పడటంతో తిరుమలలో వాతావరణంలో మార్పులు వచ్చి చల్లగా ఉండటంతో భక్తులు హాయిగా తిరుమలలో తిరుగుతున్నారు. వీకెండ్ సందర్బంగా శనివారం, ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
-
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ రైలు ప్రారంభం-టైమింగ్స్, హాల్ట్ లివే..! -
అలిపిరితో పాటు తిరుమలలో -
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications