వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 443కోట్ల బకాయిలు: ఎమ్మెల్సీ వాకాటి ఆస్తుల స్వాధీనం

బ్యాంకు నుంచి రుణం తీసుకుని గడువు ముగిసినప్పటికీ చెల్లించని కారణంగా వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌, పవర్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు .

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: బ్యాంకు నుంచి రుణం తీసుకుని గడువు ముగిసినప్పటికీ చెల్లించని కారణంగా వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌, పవర్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు హామీదారుగా ఉన్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి సంబంధించిన ఆస్తులను, కంపెనీల పేరిట ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులు ప్రకటించాయి.

నాలుగు బ్యాంకులకు కలిపి మొత్తం రూ.443.27 కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని కొన్ని స్థిరాస్తులు, నెల్లూరులోని భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకర్లు తెలిపారు.

It is said that MLC Vakati Narayana Reddys assets to be siezed.

వీఎన్‌ఆర్‌ పవర్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామ పరిధిలో 45.76 ఎకరాలు తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకున్నారు.
వీఎన్‌ఆర్‌ లాజిస్టిక్స్‌ పేరిట ఓజిలి మండలం రాచపాలం పంచాయతీ పరిధిలోని భూములను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, అప్పు చెల్లింపునకు ఇచ్చే హెచ్చరిక నోటీసులు ఇప్పటివరకు తనకు లిఖితపూర్వకంగా అందలేదని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి చెప్పారు. ఆస్తుల స్వాధీన ప్రకటనకు సంబంధించి ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ప్రకటన జారీ చేస్తున్నట్లు బ్యాంకులు కేవలం ఫోన్‌లో సంప్రదించాయని చెప్పారు.

నేషనల్‌ కంపెనీ లాబోర్డు ట్రిబ్యునల్‌ పరిధిలో ఉన్న కంపెనీలకు నోటీసులు జారీ చేసే అధికారం బ్యాంకులకు లేదన్నారు. ఇది కేవలం హెచ్చరిక నోటీసు మాత్రమేనని ఆయన తెలిపారు.

English summary
It is said that MLC Vakati Narayana Reddys assets to be siezed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X