వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత - హుటా హుటిన..!!
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కోర్టుకు హాజరైన సమయం లోనూ నీరసంగా కనిపించారు. శ్వాస సంబంధిత సమస్యలు ఈ మధ్య కాలంలో మరింత తీవ్రం అయ్యాయి. దీంతో, మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వంశీని పరామర్శించేందుకు ఆయన సతీమణి రాగా.. పోలీసులు అడ్డుకున్నారు.
వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా రోజులుగా శ్వాస సంబం ధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న వంశీకి చికిత్స అందించారు. ఈ మధ్య ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజే శారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తరువాత ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి అనారోగ్య సమస్యతో వంశీని గుంటూరు జీజీహెచ్‌కు తరలంచారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

వంశీని కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కస్టడీ సమయంలో వంశీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కంపిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మాజీ ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు. కానీ మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వంశీని గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు.
జీజీహెచ్‌లో వంశీకి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. కాగా.. జైలులో శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతున్న విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. దీంతో వైద్యం అందించాల్సిందిగా న్యాయధాకారి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. వంశీని ఆస్పత్రి లోపలికి తరలించిన తర్వాత జీజీహెచ్ ప్రధాన గేటును పోలీసులు మూసి వేశారు. వంశీని పరామర్శించేందుకు వచ్చిన ఆయన సతీమణిని పోలీసులు అడ్డుకోవటంతో కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.












Click it and Unblock the Notifications