Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చింతమనేనికి వనజాక్షి చింత..! పొగరు తగ్గించుకుంటానంటున్న ప్రభాకర్..!!

అమరావతి/హైదరాబాద్ : దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడిపి ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ గొంతు మూగపడబోతోంది. అదికారంలో ఉన్నప్పుడు కన్నూ-మిన్నూ కానకుంగా వ్యవహరించిన చింతమనేనిని దెందులూరు ప్రజలు అదఃపాతాళానికి తొక్కేసిన విషయం తెలిసిందే.ప్రభుత్వం విప్ గా ఉన్న సమయంలో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు అందరి అదికారులతో వివాదాలు కొని తెచ్చుకున్నారు చింతమనేని. ఎమ్మార్వో వనజాక్షి దగ్గర నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకూ అందరినీ టార్గెట్ చేసారు చింతమనేని. అంటు దెందులూరు నియోజకవర్గంలో కూడా చింతమనేని అరాచకాలు అన్ని ఇన్నీ కావని ప్రజలు చెప్పుకొంటుంటారు. చింతమనేని వ్యవహారం పట్ల విసిగిపోయిన ప్రజానికం తగిన గుణపాఠం చెప్పినట్టు తెలుస్తోంది.

మీడియా రెచ్చగొతుతోంది..! అయినా నోరు తెరవనంటున్న చింతమననేని..!!

మీడియా రెచ్చగొతుతోంది..! అయినా నోరు తెరవనంటున్న చింతమననేని..!!

అంతే కాకుండా చింతమనేని అరాచకాల పట్ల వైసీపి ప్రభుత్వం విచారణ జరుపుతుందని స్పష్టం చేయడంతో చింతమనేని గొంతులో వెలక్కాయ పడినట్టు అయ్యింది. పార్టీలో నేతల పరిస్థితి ఎవరిది అంతగా బాగాలేక పోవడంతో చింతమనేని పక్షాన నిలబడే నాథుడే కరువయ్యాడు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితే బాగా లేక పోవడంతో ఎవరికి చెప్పుకోలేని దీన పరిస్థితిలోకి వెళ్లారు చింతమనేని. వైసీపి ప్రభుత్వం ముందుగా చెప్పినట్టే తనపై రేపు విచారణ జరిపి శక్ష ఖరారు చేస్తే ఏంటి పరిస్తితనే అంశంపై తీవ్రంగా మదనపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలతో పాటు వివాదాలకు దూరంగా ఉండాలని చింతమనేని ప్రభాకర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 అదికారంలో ఉన్నప్పుడు అరాచకాలు..! ఇప్పుడు వెంటాడుతున్న ప్రతీకారాలు..!!

అదికారంలో ఉన్నప్పుడు అరాచకాలు..! ఇప్పుడు వెంటాడుతున్న ప్రతీకారాలు..!!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి తనవంతు పాత్ర ఉందని పార్టీ కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు.బాద్యత గల ప్రజాప్రతినిధినన్న ఇంగిత జ్జానం మరిచి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసేకున్నాడు కాబట్టే పార్టీకి తీవ్ర స్ధాయిలో నష్టం జరిగిందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఎమ్యెల్యే స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి అదే ప్రజలను దూషించడం, అదికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, దళితుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలు పార్టీ కి శరాఘాతంలా పరిణమించాయని, ఈ అంశాలను పసిగట్టే పరిజ్జానాన్ని చంతమనేని కోల్పోయారని, అందుకే ఘోరంగా ఓడిపోయారని పార్టీ లో చర్చ జరుగుతోంది. ఐతే చింతమనేని అరాచకాలపై వైసీపి ప్రభుత్వం విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.. తప్పులు నిర్దారణ ఐతే శిక్షించేందుకు వెనకాడేది లేదని వేసిపి నేతలు చెప్పుకొస్తున్నారు. ఏపిలో తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానని నేత ఆయన.

 చింతమనేని దురుసు ప్రవర్తన..! దూరం పెడుతున్న పార్టీ నేతలు..!!

చింతమనేని దురుసు ప్రవర్తన..! దూరం పెడుతున్న పార్టీ నేతలు..!!

కొల్లేటి తీరంలో మ‌కుటం లేని మ‌హారాజుగా చ‌క్రం తిప్పిన ప‌సుపు నేత‌గా చింతమనేని వర్ణించాలి. అడ్డ‌గోలుగా స‌ర‌స్సులో రోడ్డు వేస్తూ.. అడ్డొచ్చిన అట‌వీశాఖ అధికారుల‌పై తిట్ల‌ దండ‌కం అందుకున్నాడు. ఇసుకాసురుడిగా మారి.. ఇష్టానుసారం ఇసుక త‌వ్వుతుంటే ఇదేమ‌ని అడిగిన అప్ప‌టి ఎమ్మార్వో వ‌న‌జాక్షిని జ‌ట్టుప‌ట్టుకుని ట్రాక్ట‌ర్ కింద ప‌డేసి తొక్కించేందుకు ప్ర‌య‌త్నించి ఘ‌నుడు. న‌డిరోడ్డుపై ఆర్టీసీ డ్ర‌యివ‌ర్‌ను కేవ‌లం చంద్ర‌బాబు ఫొటో స‌రిగాలేదంటూ చేయి చేసుకున్న ఘ‌న‌త సాధించిన ఎమ్మెల్యే. అంత‌కుమించి చెప్పాలంటే టీడీపీ ప్ర‌భుత్వానికి వీర‌విధేయుడు. ప్ర‌భుత్వ విప్ కూడా.. త‌న‌కు తానుగా ఓడి పోవాల‌ని భావిస్తే త‌ప్ప ఓట‌మి త‌న‌నేమీ చేయ‌దంటూ మొన్న‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడు. ప‌నిలో ప‌నిగా వైసీపీ అభ్య‌ర్ధి అబ్బ‌య్య‌చౌద‌రిని ఘోరంగా ఓడిస్తానంటూ మ‌రీ స‌వాల్ విసిరాడు. అయితే.. ఇదంతా మొన్న‌టి ఓట‌మితో ప‌టాపంచ‌లైంది. నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ.. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

చింతమనేని అక్రమాలపై వైసిపి విచారాణ..! వణికిపోతున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే..!!

చింతమనేని అక్రమాలపై వైసిపి విచారాణ..! వణికిపోతున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే..!!

పైగా మీడియా ముందు నోరు తెర‌చిన దాఖాల్లేవు. దెందులూరు త‌న సొంత అడ్డాగా భావించిన చింత‌మ‌నేని తాను నీతికి కేరాఫ్ చిరునామాగా ప‌లుమార్లు చెప్పుకొచ్చాడు. కేవ‌లం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చేందుకు మాత్ర‌మే తాను బూతులు తిట్ట‌డం, అధికారుల‌ను బెదిరించ‌టం చేస్తుంటానంటూ గొప్ప‌గా తొడ‌లు కొట్టిన సంద‌ర్భాలున్నాయి. అయితే.. వైసీపీ అధికారంలోకి రావ‌టంతో చింత‌మ‌నేని నీతి ఎంత వ‌ర‌కూ ఉంద‌నే విష‌యాన్ని కూపీ లాగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. రైతుల‌కు చేరాల్సిన పైపులు, పేద‌ల‌కు అందాల్సిన గేదెల‌ను త‌న సొంత‌వారి పేరిట స్వాహా చేసిన‌ట్టు అధికారులు గుర్తించారు. మ‌ట్టి, ఇసుక‌నే గాకుండా నియోజ‌క‌వ‌ర్గంలోని నిరుపేద‌ల క‌డుపును కూడా కొట్టేంత‌గా దిగ‌జార‌టం పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఇదే సందర్బంలో పార్టీకి కనబడకుండా చింతమనేని ప్రభాకర్ పూడ్చలేని నష్టం చేసారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతమనేని నోటి దూల వల్ల పార్టీ డ్యామేజ్ అయ్యిందని, దాని ప్రభవం చంద్రబాబు వరకూ పాకిందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. పార్టీ వాతావరణాన్ని, అదికార పార్టీ వ్యూహాలను పసిగట్టిన చింతమనేని కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+