వందేభారత్ ప్రయాణికులకు ముఖ్య గమనిక!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోను వీటిని పట్టాలకెక్కిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పుచెందుతూ భారతీయ రైల్వే తీసుకొచ్చిన కొత్తతరం ఆధునిక రైళ్లే వందేభారత్. ప్రయాణికుల భద్రత కోసం పలు ఫీచర్లు ఏర్పాటు చేశారు. సాంకేతికంగా ఉన్నతంగా వీటిని రూపొందించారు.
ప్రస్తుతం ఇవి నీలం రంగులో తయారవుతున్నాయి. త్వరలోనే కాషాయ రంగుతో రాబోతున్నాయి. అలాగే కోచ్ ల్లో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఫీచర్లను మెరుగుపరుస్తున్నారు. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సందర్శించారు. వందే భారత్ రైళ్లలో కొన్ని మార్పులు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆ ఫీచర్లేమిటో తెలుసుకుందాం.

వందే భారత్ కోచ్‌లలో ప్రయాణికులు కూర్చునే సీట్లు గట్టిగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో కొత్త కోచ్ ల్లో మెత్తటి కుషన్‌లను ఉపయోగిస్తున్నారు.ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును ఎరుపు నుంచి నీలంకు మారుస్తున్నారు.ఫుట్‌రెస్ట్‌ను మరింత పొడిగిస్తున్నారు.సీట్ల వెనుక మ్యాగజైన్ బ్యాగ్స్ ఏర్పాటు చేయబోతున్నారు.కూర్చునే విధానం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు సీటు రిక్లైనింగ్ యాంగిల్‌ను పెంచుతున్నారు. దీనివల్ల సీట్లను వెనక్కి జరుపుకోవడానికి వీలుంటుంది.దివ్యాంగుల వీల్‌ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేసి, అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు












Click it and Unblock the Notifications