వందే భారత్ ఎక్స్ ప్రెస్ అద్భుత దృశ్యకావ్యం
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రస్తుతం నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి రేణిగుంట మీదగా చెన్నై, కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ మార్గాల్లో ఇవి నడుస్తున్నాయి. నడుస్తున్న రైళ్లన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి. వాస్తవానికి ఒకే నెంబరు మీద రెండు నుంచి దూరాన్ని బట్టి మూడు, నాలుగు రైళ్లు ఉంటాయి. అయితే వందేభారత్ విషయానికొస్తే ఒక నెంబరు మీద ఒక బండే ఉంటుంది.
✨ Beauty of Vande Bharat Express
— DRM Vijayawada (@drmvijayawada) September 29, 2023
#VandeBharat meets #VandeBharat
📷 VC: @RailfansScr pic.twitter.com/Ihca6WPcfL
ట్రిప్పు రద్దయినట్లే
ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే రైలు ఉదయం బయలుదేరి వెళ్లి మధ్యాహ్నం మళ్లీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వస్తుంది. ర్యాక్స్ అందుబాటులో లేకపోవడంవల్ల ప్రస్తుతానికి ఒక నెంబరు మీద ఒకటే రైలును నడుపుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి బండి ఆగిపోతే ఆరోజుకు ప్రయాణం రద్దయినట్లే. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే రైలులో సమస్య వస్తే ఆ ట్రిప్పుతోపాటు విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు కూడా రద్దయినట్లే.

ఒకదానికొకటి ఎదురెదురుగా
భారతదేశంలో వందే భారత్ రైళ్లు నడిచే రూట్లల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు నాలుగు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావడంతో ఒక చోట రెండు వందే భారత్ ట్రైన్స్ ఎదురయ్యే అరుదైన దృశ్యం చూడొచ్చు. ఈ దృశ్యాన్ని భారతీయ రైల్వే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఒక వందే భారత్ రైలు వెళ్తుంటే, మరో వందే భారత్ ట్రైన్ ఎదురొచ్చింది. ఇటువంటి అరుదైన దృశ్యాన్ని ప్రయాణికులు వీక్షించాలన్నదే తమ ఉద్దేశమని రైల్వే పేర్కొంది. రోజురోజుకు వందే భారత్ రైళ్లపై ప్రయాణికులకు ఆసక్తి పెరుగుతోందని, రెండు రోజులు ముందుగానే టికెట్లు అయిపోతున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications