విశాఖ టు విజయవాడ ఇక 4 గంటలే : వందేభారత్ రెడీ - ఒకటి కాదు రెండు..!!

విశాఖ కేంద్రంగా కేంద్రం ఇచ్చిన హామీ పట్టాలెక్కుతోంది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ ఏపీకి వందేభారత్ రైలు కేటాయిస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ఇప్పుడు ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు కేటాయిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒక రైలు వచ్చే నెల ప్రారంభం కానుంది. విశాఖ నుంచి విజయవాడ వరకు ఈ రైలు నడపాలని నిర్ణయించారు. తొలి రైలు ప్రారంభానికి సంబంధించి రైల్వే అధికారులు ట్రాక్ పరిశీలన చేసారు. ఎనిమిది కోచ్ లతో వందేభారత్ రైలు విశాఖ నుంచి విజయవాడకు పరుగులు తీయటానికి సిద్దమవుతోంది.

 విశాఖ నుంచి రెండు వందేభారత్ రైళ్లు

విశాఖ నుంచి రెండు వందేభారత్ రైళ్లు

ఏపీ ప్రజలకు త్వరలో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సెమ హైస్పీడ్ రైలు వందేభారత్ ను విశాఖ - విజయవాడ మధ్య నడిపేందుకు రంగం సిద్దమైంది. మరి కొద్ది రోజుల్లో ఈ రైలు విశాఖకు చేరుకోనుంది. ప్రస్తుతం నడుస్తున్న ఎక్స్ ప్రెస్ రైళ్లు 80 కిలీ మీటర్ల గరిష్ఠ వేగంగా ప్రయాణిస్తున్నాయి. వందే భారత్ రైల్లు గంటలకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. విశాఖ నుంచి ఈ రైలు అందుబాటులోకి వస్తే ఇక ప్రయాణ సమయం తగ్గనుంది. విశాఖ నుంచి విజయవాడ కు నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. వందేభారత్ నిర్వహణ కోసం వాల్తేరు డివిజన్ అధికారులు ట్రాక్ నిపుణులతో కలిసి ట్రాక్ పరిశీలించారు. ఇందుకోసం విశాఖ - తిరుపతి మధ్య నడిచే డబుల్ డక్కర్ రైలును వినియోగించారు. వందేభారత్ రైలు కోచ్ ల నిర్వహణ సామర్ధ్యాల పైన పరిశీలన చేసారు.

 వచ్చే నెలలో విశాఖ టు విజయవాడ ప్రారంభం

వచ్చే నెలలో విశాఖ టు విజయవాడ ప్రారంభం

ఇప్పటికే విశాఖ డివిజన్ కు 8 కోచ్ లతో కూడిన రెండు యూనిట్స్ ను రైల్వే బోర్డు కేటాయించింది. డిసెంబర్ రెండో వారంలో విశాఖ - విజయవాడ మధ్య వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. త్వరలోనే మరరో వందేభారత్ రైలును విశాఖ నుంచే ప్రారంభించేందుకు రైల్వే బోర్డు అంగీకారం తెలపింది. ఆ రైలు విశాఖ నుంచి తిరుపతి వరకు, లేదా విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రయాణీకుల రద్దీ.. డిమాండ్ కు అనుగుణంగా రెండో రైలు ఎక్కడకు నడపాలనేది త్వరలో నిర్ణయం తీసుకోన్నారు. దీని ద్వారా ఒక రాష్ట్రం..ఒకే ప్రాంతం నుంచి రెండు వందేభారత్ రైళ్లు కేటాయించటం అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తొలి రైలు ప్రారంభం తరువాత రెండో రైలు గురించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు.

 టికెట్ ధరలు..సదుపాయాలు ఇలా

టికెట్ ధరలు..సదుపాయాలు ఇలా


ఇక, వందేభారత్ రైలులో ఛైర్ కార్..ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ప్రస్తుతం పలు మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఆ రైళ్లలో అమలు చేస్తున్న టికెట్ ధరల ప్రకారం విశాఖ నుంచి విజయవాడ కు ఛైర్ కార్ లో దాదాపు రూ 850 వరకు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో రూ 1600 నుంచి రూ 1,650 వరకు టికెట్ ధర ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతీ కోచ్ లోనూ 30 ఇంచిల స్క్రీన్ తో ప్రయాణీకుల సమాచార వ్యవస్థ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ నుంచి ప్రారంభం కానున్న వందేభారత్ తొలి రైలు ఇదే కానుంది. దీంతో.. ఇప్పటికే రద్దీగా ఉన్న విశాఖ - విజయవాడ లైన్ లో ఈ రైలు ద్వారా ప్రయాణీకులకు సౌకర్యంతో పాటుగా సమయం ఆదా కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+