పవన్ Vs వంగా గీత - పిఠాపురంలో బిగ్ టర్న్, కలిసొచ్చేదెవరికి..!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం వైపు అందరి చూపు నెలకొంది. జనసేనాని పవన్ అక్కడ పోటీ చేస్తున్నారు. ప్రచారం ప్రారంభించిన పవన్ రెండో రోజు స్థానికంగా మూడు పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారు. తొలి ప్రచార సభలో తాను గెలిస్తే పిఠాపురం ను మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. వైసీపీ పైన విమర్శలు చేసారు. వీటి పైన వైసీపీ అభ్యర్ది వంగా గీత స్పందించారు. పవన్ ను రాజకీయంగా టార్గెట్ చేసారు.
పవన్ ప్రచారం
పిఠాపురంలో పవన్ తనను గెలిపించాలని అభ్యర్దించారు. తనను అసెంబ్లీకి పంపాలని కోరారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి ఓడిన పవన్ ఈ సారి ఎలాగైనా పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. టీడీపీ స్థానిక ఇంఛార్జ్ వర్మ ఇప్పటికే పవన్ కు మద్దతు ప్రకటించారు. తాజాగా స్థానిక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ పవన్ తన తొలి ఎన్నికల సభలో పిఠాపురం ప్రజలకు సమస్యల పరిష్కారం పైన హామీ ఇచ్చారు. అదే సమయంలో స్థానిక సమస్యలను పరిష్కరించని వైసీపీ నేతలను..వైసీపీ అభ్యర్ది వంగా గీతను ప్రశ్నించాలని సూచించారు. సీఎం జగన్ తో పాటుగా వైసీపీ నేతల పైన విమర్శలు కొనసాగించారు.

వంగా గీత కౌంటర్
పవన్ కల్యాణ్ తనను ఓడించటానికి వైసీపీ నేతలు పిఠాపురంలో మొహరించారని..తన వద్ద ఏముందని ఇంత మంది ఒక్కడిని ఓడించటానికి వస్తున్నారని ప్రశ్నించారు. జనసేన అంటే వైసీపీకి భయమని చెప్పుకొచ్చారు. పవన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా టీడీపీ, బీజేపీ స్థానిక నేతలతో ఈ రోజు సమావేశం అవుతున్నారు. ఎన్నికల్లో కలిసి పని చేయటం పైన దిశా నిర్దేశం చేయనున్నారు. పవన్ వ్యాఖ్యల పైన వంగా గీత స్పందించారు. పిఠాపురం ను అప్రతిష్ట పాలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడవద్దని వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి 25 ఏళ్లుగా తానేం చేశానో ప్రజలకు తెలుసని చెప్పారు. పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని గీత విమర్శించారు.

కలిసొచ్చేదెవరికి
కూటమి అందరూ కలిసి ప్రజలకు వాలంటీర్లను దూరం చేశారని గీత ఆరోపించారు. తన దగ్గర పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేక ఎజెండా ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలను చులకన చేసే విధంగా పవన్ కళ్యాణ్ డబ్బులు కంటైనర్ లు అంటూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మండలాల వారీగా తమ నేతలు ప్రచారం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. వంగా గీత ఇప్పటికే పిఠాపరంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. గతంలో జనసేనలో పని చేసిన నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. మరో వైపు ముద్రగడ పద్మనాభం స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసారు. ఇటు పవన్ ప్రచార బరిలోకి దిగటంతో ఇప్పుడు పిఠాపురం లో ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది..సామాజిక సమీకరణాలు ఎవరికి కలిసి వస్తాయనే చర్చ రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications