సాక్షి ఎడిటర్‌ను సభకు పిలిచి సారీ చెప్పించాలి: వంగలపూడి అనిత డిమాండ్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: సోషల్ మీడియాలో పోకడ సరిగా లేదని, సాక్షి పత్రిక అసత్య కథనాలు రాస్తోందని టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత గురువారం అన్నారు. దీనిపై సాక్షి ఎడిటర్‌ను సభకు పిలిచి క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ నాయకులను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనైతిక పోకడలకు అడ్డుకట్ట వేసే విధంగా చట్టం తేవాలని అనిత స్పీకర్‌ను కోరారు.

Vangalapudi Anitha demands Sakshi editor's apology

కాగా, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ప్రతిపక్షనేత రెండోసారి ఆరోపణలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో చెప్పిన విషయం తెలిసిందే. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పుల్లారావు జగన్‌కు సవాల్‌ విసిరారనీ, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్టు పుల్లారావు స్పష్టంచేశారని సీఎం సభలో చెప్పారు.

అందువల్ల ఈ వ్యవహారంపై విచారణకు సభా సంఘం కావాలా, న్యాయవిచారణ కావాలో ప్రతిపక్షమే చెప్పాలని డిమాండ్‌ చేశారు. న్యాయ విచారణలో మంత్రి చెప్పింది తప్పని తేలితే ఆయనను సభనుంచి వెలివేద్దామని, జగన్‌ ఆరోపణలు తప్పని రుజువైతే ఆయనను కూడా సభనుంచి వెలివేద్దామని, రెండింటికీ ప్రతిక్షం సిద్ధమైతే.. ఇప్పుడే న్యాయవిచారణకు ఆదేశిస్తానని చంద్రబాబు అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party MLA Vangalapudi Anitha demands YSRCP chief YS Jaganmohan Reddy Sakshi editor's apology.
Please Wait while comments are loading...