చీరల కొట్లో పని చేశారా, అంత కచ్చితంగా రేట్లు... విష్ణు వర్ధన్ రెడ్డికి అనిత అదిరిపోయే పంచ్

రాజధాని అమరావతి ఉద్యమం 310 రోజులుగా కొనసాగుతూనే ఉంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్ తో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు సాగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న టిడిపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది అంటూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ఇదే సమయంలో 50 వేల రూపాయల చీరలు కట్టుకున్న మహిళ కూడా ఉద్యమాలు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారానికి కారణమైంది.

బీజేపీ నేత విష్ణు వ్యాఖ్యల దుమారం ... టీడీపీ నేతలు ఫైర్

బీజేపీ నేత విష్ణు వ్యాఖ్యల దుమారం ... టీడీపీ నేతలు ఫైర్

రాజధాని అమరావతిలో ఉద్యమం కొనసాగుతున్న వేళ విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే రాజధాని ఉద్యమం చేస్తున్న మహిళలను ఉద్దేశించి విష్ణు వర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ టిడిపి నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విష్ణువర్ధన్ రెడ్డి పై సెటైర్లు వేస్తున్నారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విష్ణువర్ధన్ రెడ్డి ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

గతంలో చీరలు అమ్మారా .. చిల్లర మాటలు దేనికండీ

గతంలో చీరలు అమ్మారా .. చిల్లర మాటలు దేనికండీ

సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే పంచ్ వేశారు . గతంలో చీరలు అమ్మారా విష్ణు రెడ్డి అంటూ అనిత విమర్శనాస్త్రాలు సంధించారు . ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన అనిత పూర్వాశ్రమంలో చీరలు కొట్లో పని చేశారా విష్ణు రెడ్డి గారు అని ప్రశ్నించారు . అంత కచ్చితంగా చీరల రేట్లు చెబుతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు అంటే ఇలానే ఉండాలని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి గారి ప్రాపకం కోసం వేరే మార్గం వెతుక్కోండి అంటూ సలహా ఇచ్చారు. ఇలా చీరలు, చొక్కాలు అంటూ చిల్లర మాటలు దేనికండి అంటూ అనిత విష్ణువర్ధన్ రెడ్డి పై రివర్స్ ఎటాక్ చేశారు.

Recommended Video

    Watch Video : TDP Anitha Vs YSRCP Giddi Eswari @ AP Assembly Media Point - Oneindia Telugu
    సోషల్ మీడియాలో విమర్శలను ఖండించిన విష్ణువర్ధన్ రెడ్డి

    సోషల్ మీడియాలో విమర్శలను ఖండించిన విష్ణువర్ధన్ రెడ్డి

    అమరావతి మహిళా రైతులను అవమానించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రిప్లై ఇచ్చారు. అమరావతి ఉద్యమం ప్రారంభమైన ఏడవ రోజే తాను ఉద్యమంలో పాల్గొన్నానని, తన ఫోటో పెట్టి అమరావతి రైతులను అవమానించినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మిత్రుల ద్వారా తెలిసిందంటూ పేర్కొన్న ఆయన ఇలాంటి తప్పుడు ప్రచారంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటూ విమర్శించారు. రాజకీయ విమర్శలు చేస్తాం కానీ రైతు ఉద్యమకారులను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తను మాట్లాడింది అమరావతి ప్రాంత మహిళా రైతులను ఉద్దేశించి కాదని, కావాలనే దీనిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+