'ఆమె' కు ప్రత్యర్థిని సిద్ధం చేసిన జగన్

తెలుగుదేశం పార్టీ తరఫున దూకుడుగా రాజకీయాలు చేస్తుంటారు. తెలుగు మహిళ రాష్ట్రఅధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరుతెచ్చుకున్నారు. ఒకరకంగా ఆమె తన మాటలతో ప్రత్యర్థి పార్టీపై నిప్పులు చెరుగుతారు. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే నేతల్లో ఆమె కూడా ఒకరు. అధిష్టానం కూడా ప్రోత్సహిస్తుండటంతోపాటు పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి అనిత ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

కల్యాణి కోసం కొత్త పోస్టు

కల్యాణి కోసం కొత్త పోస్టు

అయితే వంగలపూడి అనితకు గట్టి ప్రత్యర్థి ఉండాలని భావించిన వైసీపీ అధిష్టానం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన వరుడు కల్యాణిని రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఆమె కోసమే ఈ పోస్టును కొత్తగా సృష్టించారు. చీరాలకు చెందిన పోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. అయినప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరుతో కల్యాణిని నియమించడానికి కారణం వంగలపూడి అనిత.

బలమైన వాయిస్ ఉండాలని..

బలమైన వాయిస్ ఉండాలని..

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించాలనుకున్న అధిష్టానానికి కల్యాణి మంచి ఆప్షన్ గా కనపడింది. అంతేకాకుండా ఆమెకు మంచి టాకింగ్ పవర్ ఉండటం కూడా కలిసివస్తోంది. అనిత విమర్శలకు కల్యాణి ప్రతి విమర్శలు కూడా అదేస్థాయిలో చేస్తోంది. రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొత్తం గెలవాలనే లక్ష్యాన్ని జగన్ నిర్ధేశించుకున్నారు. అందుకనుగుణంగా ఇప్పటినుంచే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు.

అనితను ఢీకొట్టగలిగే నాయకురాలిగా..

అనితను ఢీకొట్టగలిగే నాయకురాలిగా..


రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకైనా ఎంపీగా పోటీచేసే అభ్యర్థుల కొరత ఉంటుంది. ఆ లోటును పూడ్చుకోవడానికి అన్ని పార్టీలు అభ్యర్థుల కోసం వేటను కొనసాగిస్తుంటాయి. ఈ కోవలోనే ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటుకు కల్యాణిని నిలబెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్న భీశెట్టి సత్యవతి గవర సామాజికవర్గానికి చెందిన నాయకురాలు. కల్యాణి కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందినవారు. రాజకీయంగా సామాజికవర్గాల పరంగా బేరీజు వేసుకుంటున్న వైసీపీ అధిష్టానం కల్యాణికి ప్రాధాన్యత కల్పిస్తోంది. వంగలపూడి అనితను గట్టిగా ఢీకొట్టగలిగే నాయకురాలిగా వరుడు కల్యాణిని వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏ రకమైన పోటీ జరుగుతుందో? ఎవరు విజయం సాధిస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+