కొండమీద ఉండబట్టే.. లేకపోతే దుర్గ గుడిని బాబు కూల్చేవాడు : వంగవీటి రాధా
విజయవాడ : కృష్ణా పుష్కర పనుల్లో భాగంగా.. ఏపీ సర్కార్ పలు హిందూ దేవాలయాలను కూల్చివేయడంతో.. కూల్చేసిన దేవాలయాలన్నింటిని తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. ఇదే డిమాండ్ తో బెజవాడలో దీక్ష చేస్తోన్న వీహెచ్ పీ సభ్యులను శుక్రవారం నాడు వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు వంగవీటి రాధా పరామర్శించారు.
దేవాలయ పునర్మిర్మాణం కోసం దీక్ష చేస్తోన్న వీహెచ్ పీ సభ్యులకు సంఘీభావం తెలిపిన రాధా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆలయాల కూల్చివేత గురించి ప్రస్తావించిన ఆయన.. 'మన అదృష్టం కొద్దీ దుర్గమ్మ తల్లి కొండ మీద ఉండిపోయిందని.. లేకపోతే అమ్మవారి దేవాలయాన్ని కూడా ఈపాటికి చంద్రబాబు గారు తొలగించేవారని' ఆరోపించారు రాధా.

దేవాలయాలను తొలగించి.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆలయాలను దర్శించుకునే వెసులుబాలు లేకుండా చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు రాధా. వీహెచ్ పీ సభ్యులకు మద్దతు తెలుపుతూ.. తొలగించిన ఆలయాలను వెంటనే పునర్నిర్మించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారాయన.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications