రైతు భరోసా నిధులు విడుదల.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వానాకాలం సీజన్ కు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో బటన్ నొక్కి ఫండ్స్ ను రిలీజ్ చేశారు. దాంతో మొదటి విడతలో భాగంగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది ఖాతాల్లో రూ. 2,482 కోట్లు జమ కానున్నాయి. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాలకు రూ. 9 వేల కోట్లను దశలవారీగా విడుదల చేయనున్నారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు కేవలం రూ. 69 వేల కోట్లు మాత్రమే ఉందని.. అయితే 2023 నాటికి అది ఏకంగా రూ. 8.11 లక్షల కోట్లకు చేరిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పటి ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో అప్పుల ఊబిలోకి నెట్టిందని పేర్కొన్నారు.

ఇక రైతు భరోసా నిధులను ఎలా చెక్ చేసుకోవాలి..? రైతు భరోసా నిధులు బ్యాంక్ అకౌంట్ లో జమ అయినట్టుగా సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల నంబర్లకు మెసేజ్ ను పంపుతుంది. అందుకే మీ ఫోన్ కు మెసేజ్ లు వచ్చాయా..? లేదా..? అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఏటీఎం కార్డును కూడా ఉపయోగించి మినీ స్టేట్ మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక యూపీఐ పేమెంట్ ఉంటే మీ సేవింగ్స్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు బ్యాంక్ కు వెళ్లి పాస్ బుక్ చూపించడంతో కూడా రైతు భరోసా నిధులు జమ అయ్యాయో..? లేదో..? తెలుస్తుంది.












Click it and Unblock the Notifications