మహేశ్ బాబు AMB సినిమాస్‌ కు బిగ్ షాక్.. మరో 5 థియేటర్లకూ..

సినిమా టికెట్లపై కేంద్రం జీఎస్టీ (GST) రేట్లు తగ్గించినా ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు వర్తింపజేయకుండా లాభపడినందుకు గాను సూపర్‌ స్టార్ మహేశ్ బాబుకు చెందిన AMB సినిమాస్‌ తో పాటు మరో 5 థియేటర్లపై GST అప్పిలేట్ ట్రిబ్యునల్ (GSTAT) జరిమానా విధించింది. ఈ మేరకు చర్యలు తీసుకుంది.

ఈ మేరకు GSTAT ఆదేశాల ప్రకారం.. AMB సినిమాస్‌ పై విధించిన రూ.1.7 కోట్లలో ప్రస్తుతం రూ.35 లక్షలు జమ చేయాలని ఆదేశించింది. అంతేకాక జ్యోతి థియేటర్ రూ.19.8 లక్షలు, భ్రమరాంబ సినిమాస్ రూ.11.8 లక్షలు, కుమార్ 70ఎంఎం రూ.2.5 లక్షలు, అలాగే ఏఎస్ఆర్ సినిమాస్ రూ.9.6 లక్షలు, విశ్వనాథ్ 70ఎంఎం రూ.9 లక్షలు చొప్పున 18 శాతం వడ్డీతో కలిసి వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

సినిమా టికెట్లపై 2019 జనవరి 1 నుంచి జీఎస్టీని తగ్గించినప్పటికీ.. సదురు థియేటర్లు బేస్ టికెట్ ధరలను పెంచి తుది ధరను యథాతథంగా ఉంచాయి. దీంతో ప్రేక్షకులకు దక్కాల్సిన బెనిఫిట్స్‌ థియేటర్లే పొందాయని ట్రిబ్యునల్ నిర్ధారించింది. ఇక ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మీషన్ ఇచ్చిందని ఏఎంబీ వాదనను GSTAT తోసిపుచ్చింది. ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నా కేంద్ర జీఎస్టీ నిబంధనల నుంచి మినహాయింపు లభించదని క్లారిటీ ఇచ్చింది.

GSTAT Imposes Fine on Mahesh Babu s AMB Cinemas and 5 Other Theaters for Not Passing GST Benefit

ఇక ట్రిబ్యునల్ ప్రకారం.. ఈ థియేటర్లు కేంద్ర వస్తువులు, సేవల పన్ను చట్టంలోని సెక్షన్ 171 లోని యాంటీ-ప్రాఫిటీరింగ్ నిబంధనలను ఉల్లంఘించాయి. జీఎస్టీ రేట్లు తగ్గినప్పుడు లేదా ఇన్‌ పుట్ టాక్స్ క్రెడిట్ పెరిగినప్పుడు ఆ ప్రయోజనాన్ని వస్తువులు లేదా సేవల ధరలను తగ్గించడం ద్వారా నేరుగా వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసుల్లో మాత్రం ఎలాంటి జరిమానా విధించలేదు. ఎందుకంటే ఈ ఉల్లంఘనలు 2020 జనవరి 1 కు ముందే జరిగినట్లుగా తేలింది. జరిమానాలకు సంబంధించిన నిబంధనలు ఆ తేదీ తర్వాతే అమల్లోకి వచ్చాయని ట్రిబ్యునల్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+