ఆపరేషన్ సింధూర్ లో దొరికిన కేంద్రం..! స్పీకర్ కు కాంగ్రెస్ నోటీసు..!
గతేడాది పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సందర్భంగా చోటు చేసుకున్న ఓ పరిణామంపై కేంద్రం ఇరుకున పడింది. దీనిపై గతంలో పార్లమెంట్ లో కేంద్రం ఇచ్చిన వివరణకూ, తాజాగా ప్రకటించిన వివరాలకూ పొంతన లేకపోవడంతో కేంద్రం ఇబ్బందుల్లో పడింది. దీనిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ (Congress) పార్టీ.. అప్పట్లో లోక్ సభలో ఈ ప్రకటన చేసిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సభా హక్కుల నోటీసు ఇచ్చింది.
గత సంవత్సరం ఆపరేషన్ సింధూర్ చర్చ సందర్భంగా ఏ భారతీయ సైనికుడూ మరణించలేదని చెప్పి పార్లమెంటును తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో, లోక్‌సభ కార్యవిధాన నియమాలలోని రూల్ 223 ప్రకారం రక్షణ మంత్రిపై హక్కుల ఉల్లంఘన విచారణను ప్రారంభించాలని వేణుగోపాల్ కోరారు.

In the debate in Lok Sabha on Operation Sindoor, Defence Minister Rajnath Singh lied to the people of India. It was a straightforward, clear-cut lie - to mislead the House.
— K C Venugopal (@kcvenugopalmp) June 30, 2026
How could he, in July 2025, say that no Indian soldier was martyred, and then a year later the forces… pic.twitter.com/gEvHVoU1el
పహల్గామ్ ఉగ్రవాద దాడి, తదనంతరం జరిగిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి గతేడాది జూలై 28న జరిగిన చర్చలో, భారత సైనికులకు ఎటువంటి హానీ జరగలేదని రాజ్ నాథ్ సింగ్ సభకు తెలిపారని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. అయితే ఆ సైనిక చర్యలో సాయుధ దళాలకు చెందిన ఆరుగురు సిబ్బంది మరణించారని ప్రభుత్వం తాజాగా అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు.
పార్లమెంటును తప్పుదారి పట్టించడం లేదా సమాచారాన్ని దాచిపెట్టడం అనేది సభా హక్కుల ఉల్లంఘన, సభ ధిక్కారం కిందకు వస్తుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ అయిన వేణుగోపాల్.. ఎక్స్ లో పెట్టిన పోస్టులో భారత ప్రజలకు అబద్ధం చెప్పారు అంటూ ఆరోపించారు.














Click it and Unblock the Notifications