ఏసీ రూంలో ఉంటే కాదు: చంద్రబాబుపై వంగవీటి రాధా వాగ్భాణాలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఉదయం వంగవీటి రాధా నగరంలో ధర్నాకు దిగారు.

విజయవాడ నగరంలో నెలకొన్న మంచి నీటి సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌తో గుణదల సమీపంలో నడిరోడ్డుపై ధర్నాకు దిగిన వంగవీటి రాధాకు వామపక్షాలు మద్దతుగా నిలిచాయి.

Vangaveeti Radha fires at Chandrababu

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసుకుని వాగ్బాణాలు సంధించిన రాధా.. ఏసీ గదుల్లో కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని ప్రభుత్వాలు ఎందుకంటూ ఆయన తెలుగుదేశం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రజలకు తాగునీటి సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారం రోజుల నుంచి నీళ్లు రావడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే సమస్యను పరిష్కరించనట్లయితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+