నా తండ్రి హంతకుడతనే, కోడెల పేరెత్తకుండానే: వంగవీటి హెచ్చరిక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1988లో తన తండ్రి వంగవీటి రంగా హత్య ఘటనలో ఇప్పటి స్పీకర్ ప్రధాన నిందితుడని ఆయన ఆరోపించారు.
గుంటూరు: 1988లో తన తండ్రి వంగవీటి రంగా హత్య ఘటనలో ఇప్పటి స్పీకర్ ప్రధాన నిందితుడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరెత్తకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. కాపుల న్యాయమైన కోర్కెల సాధన కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వంగవీటి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు చేసిన పాదయాత్రకు అప్పటి ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు తీసుకునే చేశారా? అని నిలదీశారు. ముద్రగడ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతించకుంటే కాపులంతా సంఘటితమై రోడ్డెక్కుతారని, దేనికైనా తెగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందని రాధా తేల్చి చెప్పారు.
బాబు అబద్ధాలకు కాలం చెల్లింది!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును నమ్మి మోసపోయామనే భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. బాబు అబద్ధాలకు ఇక కాలం చెల్లిందన్నారు. వైసిపి ప్లీనరీలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో చంద్రబాబు పాలనకు సున్నా మార్కులు వస్తున్నాయన్నారు.
Recommended Video

వైసీపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు అడ్డంగా లూటీ చేసేవారని, రాష్ట్రంలోని భూములన్నీ నిలువునా దోపిడీ చేసేవారని పద్మ ఆరోపించారు. చంద్రబాబు పాలనకు కాలం చెల్లిందని కార్యకర్తలు ప్రజలకు చాటి చెప్పాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్లీనరీ ద్వారా చంద్రబాబు గుండెల్లో నగారా మోగించాలని పద్మ అన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications