జగన్‌కు షాక్ తప్పదా?: టీడీపీలోకి వంగవీటి! ముహూర్తం ఖరారు, మల్లాది ఎఫెక్టేనా?
Recommended Video

అమరావతి: విజయవాడ రాజకీయాల్లో మరో రాజకీయ సంచలన పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని చెప్పే వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించనున్నారా? అంటే అవుననే వాదన వినిపిస్తోంది.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం బుధవారం ఉదయం బయటికి రాగా, ఇప్పుడు వంగవీటి రాధ పార్టీ మార్పుపైనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో రాధ నోటి నుంచి అధికారికంగా ఏ విషయమూ బయటకు రానప్పటికీ, అటు తెలుగుదేశం వర్గాలు, ఇటు రాధ అనుచరులు పార్టీ మార్పు ఖాయమని చెబుతుండటం గమనార్హం.

రంగం సిద్ధం
కాగా, వంగవీటి రాధతో చర్చలు పూర్తయ్యాయని కొందరు టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తుండటంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు రాధ సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై తమతో చర్చించారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు.

ప్రాధాన్యం తగ్గిందా?
కాగా, గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న వంగవీటి రాధ.. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తన అనుచరుల వద్ద చాలాసార్లు ప్రస్తావించినట్లు తెలిసింది.

మల్లాది ఎంట్రీతో మరింత..
అయితే, కొద్దికాలం క్రితం మల్లాది విష్ణు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఆయనకు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్‌ను వైయస్ జగన్ ఖరారు చేశారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ సీటుపై వంగవీటి రాధ ఎప్పటినుంచో ఆశలతో ఉన్నారు.

బలమైన నేత దూరమైనట్లేనా?
విష్ణు రంగ ప్రవేశం తరువాతనే రాధ తొలిసారిగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాధ టీడీపీ నుంచి ఆ సీటు తనకిస్తానన్న హామీ వస్తే, పార్టీ మారుతానని చెప్పినట్టు ఆయన అనుచర వర్గం చెబుతున్నారు. అయితే, వాస్తవానికి విజయవాడ సెంట్రల్ పరిధిలో మల్లాది విష్ణుతో పోలిస్తే, వంగవీటి రాధ బలమైన నేతగా చెప్పుకోవచ్చు. గౌతం రెడ్డి వివాదం కూడా రాధాను అసంతృప్తికి గురిచేసినట్లు తెలుస్తోంది.

జగన్ పార్టీకి పెద్ద ఎదరుదెబ్బే
ఈ నేపథ్యంలో రాధకు టీడీపీ నుంచి అసెంబ్లీ సీటును ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఒక వేళ వంగవీటి రాధ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరితే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు అధికార పార్టీవైపు చూస్తుండటం వైసీపీలో కలకలం రేపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ముహూర్తం ఖరారేనా?
ఇప్పటికే వైసీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోగా, ఇప్పుడు కాపుల్లో బలమైన నాయుకుడిగా పేరున్న రాధా కూడా పార్టీ వీడటం వైసీపీపై తీవ్ర ప్రభావమే చూపనుంది. జనవరి 22న గానీ, 23వ తేదీన గానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార టీడీపీలో చేరే అవశాశాలున్నాయని తెలుస్తోంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications