ఎన్నికల్లో అసలైన గేమ్ ఛేంజర్ పవన్ కాదు ఆయనే..అయినా ఎవరు గుర్తించడం లేదు..!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ,జనసేన , బీజేపీ కూటమి ఏర్పడి అధికార వైసీపీని ఢీ కొట్టాయి. గత ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించడం సంచలనంగా మారింది. 175 సీట్లగాను 164 సీట్లు గెలుచుకుని కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.ఆయనతో పాటు మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

అయితే కూటమి విజయంలో తమది ప్రధాన పాత్ర అంటే తమదే అని టీడీపీ ,జనసేన కార్యకర్తలు క్రిడిట్ కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు తమ అండ లేకపోతే కూటమే లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే అసలు విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడును ఇక్కడెవరు కూడా గుర్తించడం లేదు. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు వంగవీటి రాధా. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాధా ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో అయిన టికెట్ దక్కుతుందని ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది.

Vangaveeti Radha played a key role in the success of the alliance

అయినప్పటికి రాధా ఎక్కడా నిరాశ చెందకుండా కూటమి గెలుపు కోసం తనవంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆయన పని చేశారు.కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో వంగవీటి రాధా ప్రభావం అధికంగా కనిపించింది. వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగను కాపులు తమ దైవంగా కొలుస్తారు. దీంతో కాపు ఓట్లను కూటమి వైపు మలచడంలో వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా తన మిత్రుడు కొడాలి నాని ఓటమిలో కూడా రాధా పాత్ర ఉందనే చెప్పాలి.

గుడివాడలో కాపులు మొదటి నుంచి కూడా కొడాలి నానికి అండగా ఉంటూ వస్తున్నారు. అలాంటి చోట కాపులను టీడీపీ వైపు మళ్లేలా చేయడంలో రాధా ప్రముఖ భూమిక వహించారు.అయితే కూటమి విజయం సాధించిన తర్వాత వంగవీటి రాధా ఊసే ఎత్తెడం లేదు. ఇటు రాధా కూడా బయటకు వచ్చి పెద్దగా హడావిడి చేసింది లేదు. అయితే వంగవీటి రాధాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+