Vangaveeti Radha : పార్టీలోకి వస్తాడనుకుంటే .. పార్టీనే ఖాళీ చేస్తున్నాడు..!
Rangaveeti Radha : ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ల దక్కని నేతలు .. పక్క చూపులు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో సర్వేలు చేయించి మరి పలువురు నేతలు పార్టీలు మారడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే వంగవీటి రాధా వైసీపీలోకి తిరిగి వస్తారంటూ కొద్దికాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది.
వైసీపీ నేతలు వంగవీటి రాధాతో పలు దశల్లో చర్చలు జరిపినట్టుగా కూడా వార్తలొచ్చాయి. రాధా సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ వైసీపీలో ఉండటంతో.. రాధా తిరిగి జగన్ పార్టీలో చేరతారని అందరూ భావించారు.

ఇదే సమయంలో రాధాతో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కాశీకి కూడా వెళ్లడంతో ..ఆయన వైసపీలో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. రాధాకు వైసీపీలోకి వస్తే ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటును వైసీపీ ఆఫర్ చేసింది. ఈ సమయంలోనే వైసీపీకి వంగవీటి రాధా గట్టి షాక్ ఇచ్చారు. తనని అవమానించిన పార్టీలోకి తిరిగి చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.

ఇంకా చెప్పాలంటే ఆయన వైసీపీనే ఖాళీ చేసే పనిలో పడ్డారు. గతంలో తనని కాదని విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం సీటు కేటాయించిన బొప్పన భవకుమార్‌ను టీడీపీలోకి తీసుకురావడంలో రాధా కీలక పాత్ర పోషించారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో బొప్పన భవకుమార్ రాధాతో భేటీ అయి టీడీపీలో చేరిక గురించి చర్చించారు. అనంతరం ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

ఇక పెనములూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలోకి రావడం వెనుక రాధా ఉన్నారని తెలుస్తోంది. పెనములూరు టికెట్ దక్కకపోవడంతో వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న పార్థసారథితో రాధా నేరుగా మాట్లాడి టీడీపీలోకి ఆహ్వానించారు. గతంలో తనుకున్న పరిచియంతో పార్థసారథి టీడీపీలోకి వచ్చేలా వంగవీటి రాధానే మంత్రంగం నడిపారని తెలుస్తోంది.
ఇలా వైసీపీ అంసృప్తి నేతలందరనీ కూడా రాధా టీడీపీలోకి తీసుకురావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం వైసీపీ అధిష్టానానికి అసలు మింగుడు పడటం లేదు. వంగవీటి రాధా పార్టీలోకి వస్తారనుకుంటే.. పార్టీనే ఖాళీ చేసే పనిలో పడ్డారని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరి వంగవీటి రాధాకు వైసీపీ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications