వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్, జగన్ రోల్ మోడల్సా: వివి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని బలపరిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు (వివి) తీవ్రంగా వ్యతిరేకించారు. వారు రోల్ మోడల్స్ కావడం దౌర్భాగ్యమని ఆయన అన్నారు.

మోడీకి మద్దతు ప్రకటించిన నటుడు పవన్ కల్యాణ్, అవినీతి మూలాల నుంచి పుట్టుకొచ్చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలు రాష్ట్రంలో రోల్ మోడల కావడం దౌర్భాగ్యమని ఆయన అన్నారు. టియుడబ్ల్యుయుజె సోమవారం ఏర్పాటు చేసిన మీట్ ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బహుళ జాతి కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే పోలవరం నిర్మాణం చేపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆదివాసీలను నీట ముంచడానికి చూస్తున్నారని మండిపడ్డారు.

సమగ్రాభివృద్ధి జరగాలి

సమగ్రాభివృద్ధి జరగాలి

తెలంగాణ ఏర్పాటు భౌగోళిక రూపంలో మార్పు తప్ప మనుషుల మధ్య కాదని వరవరరావు అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా సమగ్రాభివృద్ధి కోసం ఇరు రాష్ట్రాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రజాస్వామిక విప్లవాలే పరిష్కారం

ప్రజాస్వామిక విప్లవాలే పరిష్కారం

రెండు రాష్ట్రాల్లో సుపరి పాలన రావాలంటే ప్రజాస్వామిక విప్లవాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని వరవరరావు అభిప్రాయపడ్డారు.

ఎన్నికలను బహిష్కరించాలి

ఎన్నికలను బహిష్కరించాలి

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పార్లవమెంటరీ వ్యవస్థలోని బూటకపు ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని వరవరరావు పిలుపునిచ్చారు.

తెరాస వల్ల కూడా కాదు

తెరాస వల్ల కూడా కాదు

కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీల వల్ల ప్రజాస్వామిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు సాధ్యంకావని వరవరరావు అన్నారు.

English summary
Revolutionary poet Varavara Rao has opposed Jana Sena chief Pawan Kalyan and YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X