tdp leader varla ramaiah CM ys jagan mohan reddy chandrababu naidu వర్ల రామయ్య క్షమాపణ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు
జగన్ క్షమాపణ చెప్పండి.. సీఐడీ విచారణ అంశంపై వర్ల రామయ్య..
అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ విచారణపై హైకోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. సీఎం జగన్ కు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా చంద్రబాబును క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టబోనని చెప్పాలని అన్నారు.
చంద్రబాబు ఖాతాలో మరో స్టే: సీఐడీ విచారణకు వెళ్లనక్కర్లేదు: ఇదే కేసులో నారాయణకు ఊరట..!
సీఎం జగన్‌కు తొందరపాటు తగదని హైకోర్టు తీర్పు స్పష్టం చేస్తోందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఫిర్యాదులు చేయడం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అలవాటేనని విమర్శించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ... చంద్రబాబుకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

ఈ నెల 23న విజయవాడలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. సీఐడీ నోటీసులపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం నాలుగు వారాలు స్టే ఇచ్చింది. అప్పటివరకు సీఐడీ విచారణను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. దీనిని టీడీపీ విజయంగా అనుకొగా.. వైసీపీ తిప్పికొట్టింది.
అమరావతి అసైన్డ్ భూముల విషయంపై వైసీపీ- టీడీపీ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ఒకడుగు ముందువేసిన వర్ల రామయ్య.. జగన్‌పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.