Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ చైల్డిష్ వ్యాఖ్యలు: వర్ల సవాల్, ‘జనసేనాని.. సీపీఐ నేతలతో జాగ్రత్త!’

అమరావతి: కడప ఉక్కు సాధించే వరకు విశ్రమించేది లేదని ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య స్పష్టం చేశారు. ఏపీలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Recommended Video

    కడప స్టీల్ ప్లాంట్ బంద్ కు పవన్ మద్దతు

    సోమవారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు. తాము దీక్షలు చేస్తుంటే కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన విమర్శించారు.

     వర్ల హెచ్చరిక

    వర్ల హెచ్చరిక

    రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించిన తర్వాత ఢిల్లీ వేదికగా ఎంపీలతో ధర్నా చేస్తామని, కేంద్రంలో కదలిక రాకపోతే జరగబోయే పరిణామాలకు ప్రధాని మోడీ, అమిత్ షాలు బాధ్యత వహించాలని హెచ్చరించారు.

    పవన్ వ్యాఖ్యలు చైల్డిష్

    పవన్ వ్యాఖ్యలు చైల్డిష్

    కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్, బీటెక్ రవి చేస్తున్న ఆమరణ దీక్షపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు చైల్డిష్‌గా ఉన్నాయని వర్ల రామయ్య విమర్శించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని.. జనసేన, వైసీపీకి నైతిక విలువలుంటే సీఎం రమేష్‌కి మద్దతివ్వాలని సవాల్ విసిరారు.

    పవన్.. సీపీఐ నేతలతో జాగ్రత్త

    పవన్.. సీపీఐ నేతలతో జాగ్రత్త

    ఇది ఇలా ఉంటే, అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావుకి ముడుపులు అందాయని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆరోపించారు. అందుకే, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. రామకృష్ణతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సోమవారం విజయవాడలోని వైయస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

    లింగమనేని రమేష్.. పవన్‌కి భూమిలిచ్చాడు..

    లింగమనేని రమేష్.. పవన్‌కి భూమిలిచ్చాడు..

    టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకునే పనిలో ఉన్నారని.. రాజధాని రైతుల భూములు దోచుకున్న పచ్చదండు సామాన్యుల భూములపై కన్నువేసిందని ఆరోపించారు. లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన ఇంటిని సీఎం అధికారిక నివాసంగా మార్చుకున్నారని, ఇంక రమేష్‌కి అడ్డు అదుపు ఉంటుందా? అని ప్రశ్నించారు.

    లింగమనేని రమేష్‌.. పవన్ కళ్యాణ్‌కి కూడా భూములిచ్చారని, లింగమనేని ఎస్టేట్స్ భూదోపిడిపై సీబీఐ విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. మంత్రి ఆది నారాయణ రెడ్డి నోరు అదుపులోకి పెట్టుకుంటే మంచిదని అన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+