వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్వీ సుబ్రహ్మణ్యంను జగన్ చెంపదెబ్బ కొట్టారని టాక్.. : వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన గాలికొదిలేసి ప్రతీకారం తీర్చుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. దేశ భద్రతా రహస్యాలు బహిర్గతం చేశారంటూ ఏబీ వెంకటేశ్వరావును కక్ష్యపూరితంగా సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. అర్థరాత్రి సమయంలో సస్పెన్షన్‌ జీవో ఇచ్చారన్నారు. వెంకటేశ్వరావు తప్పు చేస్తే అంతర్గత విచారణ ఎందుకు జరిపించలేదన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై పోలీసు, ఐపీఎస్‌ అధికారుల సంఘాలు, డీజీపీ స్పందించరా అని ప్రశ్నించారు.

సీఎం జగన్‌ అందిరి పైనా పగ పట్టారని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షతో అధికారులపై చర్యలు తీసుకుంటున్నారని.. పాలన పక్కనపెట్టి మిగతా అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన అధికారులపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైఎస్‌ దగ్గర పనిచేసిన అధికారులు చంద్రబాబు దగ్గర పని చేయలేదా? అని ప్రశ్నించారు. అధికారులపై జగన్‌‌కి ఎందుకు అంత కక్ష అని మండిపడ్డ వర్ల.. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.ఆదివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలోనిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

varla ramaiah fires on cm ys jagan over ab venkateshwararao suspension

50 మంది డీఎస్సీలు, 10 మంది ఎస్పీలు 100 సీఐలు, ఎంతో మంది ఎస్సైలు వీఆర్‌లో ఉన్నారని వర్ల అన్నారు. 3 నెలలు వీఆర్‌లో ఉంటే అసాధారణ సెలవుగా పరిగణిస్తామని ప్రభుత్వం అంటోందన్నారు. ప్రభుత్వమే కక్షపూరితంగా వీఆర్‌లో ఉంచి జీతాలు ఇవ్వమంటే ఎలా కుదురుతుందన్నారు. వీఆర్‌లో ఉన్న అధికారుల్ని ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. జీతాలు ఇవ్వకపోతే.. వీఆర్‌లో ఉన్న అధికారుల పరిస్థితి ఏంటన్నారు. వారి ఆత్మగోష ప్రభుత్వానికి మందిచికాదన్నారు. ఎల్వీ సుబ్రమణ్యాన్ని జగన్‌ చెంపపై కొట్టారని అందరూ అనుకుంటున్నారని.. కక్ష్యపూరితంగానే ఎల్వీని బాపట్లకు ట్రాన్స్‌ఫర్ చేసి అవమానించారన్నారు. చెప్పిన మాట వినని అధికారులపై .. కక్ష్యసాధిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక అధికారులు లంచాన్ని గిప్ట్‌ రూపంలో తీసుకోవాలని..సాక్ష్యాత్తు మంత్రే చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇదే లైన్‌ మీద వెళ్తుందా? అని నిలదీశారు. లంచం డైరెక్టర్‌గా తీసుకోకుండా గిప్ట్‌ రూపంలో తీసుకుంటే సరేనా అని ప్రశ్నించారు. అవినీతి లేకుండా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన మంత్రే అవినీతిని ప్రోత్సహించేలా మాట్లాడినందుకు మంత్రిని సస్పెండ్‌ చేయాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

English summary
TDP Polit Bureau member Varla Ramaiah said that the Chief Minister Jagan's administration was aiming for revenge. He alleged that AB Venkateswara Rao had been suspended for allegedly exposing the country's security secrets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X