బాబాయ్‌కు గట్స్ ఉన్నాయి, సాహసమే: పవన్ కల్యాణ్‌పై వరుణ్ తేజ్

Written By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినిమాలను వదిలేయాలనే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిర్ణయంపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు. మీ బాబాయ్ పవన్ కల్యాణ్ సినిమాలను పూర్తిగా వదిలేస్తున్నట్లు చెప్పారు కదా, దానిపై మీరేమంటారని అడిగితే అది బాబాయ్ వ్యక్తిగతమని సమాధానమిచ్చారు.

తన వరకు అయితే బాబాయ్ సినిమాలు వదిలేయడం బాధగానే ఉందని అన్నారు. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన సనిమా తొలి ప్రేమ సినిమా శనివారంనాడు విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు.

Varun Tej

సినిమాల కన్నా తాను చేయాల్సిన పెద్ద పనులు ఉన్నాయని బాబాయ్ భావించి ఉంటారని, ప్రజలకు దగ్గరగా వెళ్లి సేవ చేస్తానంటే సంతోషకరమైన విషయమే కదా అని ఆయన అన్నారు

అంత స్టార్ డమ్ ఉండి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అన్నింటినీ ఒక్కసారిగా వదిలేసి వెళ్లాలంటే నిజంగా గట్స్ కావాలని తమ బాబాయ్‌కి ఆ గట్స్ ఉన్నాయని ఆయన అన్నారు. నిజంగా తాను పవన్ కల్యాణ్ స్థానంలో ఉంటే మాత్రం అంత సాహసం చేయనని ఆయన అన్నారు.

సినిమాలను వదిలేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలని పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై వరుణ్ తేజ్ ఆ విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు జెఎసి ఏర్పాటు చేయడానికి పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu cine hero Varun e said hat his uncle Pawan Kalyan is having guts.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి