వర్షాలు: హిమాయత్‍సాగర్‌లో ‘వరుణ జపం’(పిక్చర్స్)
హైదరాబాద్: వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ గురువారం ఉదయం చిలుకూరు బాలాజీ ఆలయ పూజారుల ఆధ్వర్యంలో గండిపేట జలాశయంలో ‘వరుణ జపం' నిర్వహించారు. ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ డా. ఎంవి సౌందరరాజన్, ఆలయ పూజారి రంగరాజన్ లతోపాటు సఫిల్‌గూడ నుంచి వచ్చిన వేదపండితులు రెండు గంటలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జలాశయంలో 12 మంది వేద పండితులు నాబి వరకు నీళ్లలోకి వెళ్లి మంత్రోచ్ఛరణల మధ్య వరుణ పూజలు చేసి వరుణ జపం చేశారు. అనావృష్టి నశించే విధంగా వర్షాలు సమృద్ధిగా పడాలని వేద పండితులు మంత్ర గోష వినిపించారు. సుమారు రెండు గంటల పాటు చిల్కూరు బాలాజీ ఆలయ అర్చకులు, సఫిల్‌గూడలోని వేదశాలకు చెందిన పండితులు 12 మంది వేద గోష వినిపించారు.
ఒక్కోక్కరు 11 సార్లు వరుణ జపం చేశారు. ప్రతి దేవాలయంలో పూజలు, ప్రార్థనలు, భజనలు చేయాలని ఆలయ కమిటీ ఛైర్మన్ సౌందరరాజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలయ పూజారి రంగరాజన్, శిశాలయం పూజారి సురేష్ స్వామి, వేద పండితులు శ్రీరామగనపాటి, రమేష్ వేద పండితులు పాల్గొన్నారు.

వరుణ జపం
వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ గురువారం ఉదయం చిలుకూరు బాలాజీ ఆలయ పూజారుల ఆధ్వర్యంలో గండిపేట జలాశయంలో ‘వరుణ జపం' నిర్వహించారు.

వరుణ జపం
ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ డా. ఎంవి సౌందరరాజన్, ఆలయ పూజారి రంగరాజన్ లతోపాటు సఫిల్‌గూడ నుంచి వచ్చిన వేదపండితులు రెండు గంటలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వరుణ జపం
జలాశయంలో 12 మంది వేద పండితులు నాబి వరకు నీళ్లలోకి వెళ్లి మంత్రోచ్ఛరణల మధ్య వరుణ పూజలు చేసి వరుణ జపం చేశారు.

వరుణ జపం
అనావృష్టి నశించే విధంగా వర్షాలు సమృద్ధిగా పడాలని వేద పండితులు మంత్ర గోష వినిపించారు.

వరుణ జపం
సుమారు రెండు గంటల పాటు చిల్కూరు బాలాజీ ఆలయ అర్చకులు, సఫిల్‌గూడలోని వేదశాలకు చెందిన పండితులు 12 మంది వేద గోష వినిపించారు.

వరుణ జపం
ఒక్కోక్కరు 11 సార్లు వరుణ జపం చేశారు. ప్రతి దేవాలయంలో పూజలు, ప్రార్థనలు, భజనలు చేయాలని ఆలయ కమిటీ ఛైర్మన్ సౌందరరాజన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

వరుణ జపం
ఆలయ పూజారి రంగరాజన్, శిశాలయం పూజారి సురేష్ స్వామి, వేద పండితులు శ్రీరామగనపాటి, రమేష్ వేద పండితులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications