బాబు కుమారుడిని జైలులో పెడితే..: వాసిరెడ్డి పద్మ

చంద్రబాబు 44 అంశాల్లో కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల దగ్గర నుంచి పదవుల పందేరం దాకా చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆమె అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై రాజకీయ కోణంతోనే కేసులన్నీ వేశారని ఆమె విమర్శించారు. చట్టప్రకారం, న్యాయం ప్రకారం జగన్‌కు బెయిల్ రావడం ఖాయమని నిపుణులే చెబుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ స్థితిలో చందర్బాబు, ఆయన బృందం కీచురాళ్ల రొద చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.
దర్యాప్తు చేసిన తర్వాత చార్జిషీట్లు వేశారనే విషయాన్ని చంద్రబాబు మరిచిపోతున్నారని ఆమె అన్నారు. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తోందని చంద్రబాబు కాదా అని ఆమె అడిగారు. కోర్టు విచారణలో ఉన్న కేసును కూడా ప్రభావితం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. దీంతోనే ఈ కేసు రాజకీయ కేసు అనే విషయం తేలిపోయిందని ఆమె అన్నారు.
జగన్‌ను దోషిగా నిర్ధారించే ఆధారాలు లేవు కాబట్టే తెలుగుదేశం శ్వేతపత్రం డ్రామా ఆడుతోందని ఆమె అన్నారు. చంద్రబాబు జైలు శిక్షకు గురయ్యే 18 అంశాలున్నాయని ఆమె అన్నారు. వీటిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ఆమె ప్రశ్నించారు. జగన్ బయటకు వస్తే తట్టుకోలేమని చంద్రబాబు బేజారెత్తుతున్నారని పద్మ అన్నారు. చంద్రబాబు మతి భ్రమించిందని ఆమె అన్నారు. జగన్‌ను జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతోనే చందర్బాబు కాంగ్రెసు కాళ్లు పట్టుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెసు భూస్థాపితం అయ్యే పరిస్థితి ఏర్పడిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎన్టీఆర్ కూడా చేయలేని పని వైయస్ జగన్ చేశారని ఆమె అన్నారు. కాంగ్రెసును భూస్థాపితం చేసే శక్తి ఉందని తెలిసే ఈ వేధింపులని ఆమె అన్నారు. రాష్ట్ర విభజనను నిలిపేస్తున్నట్లుగా కేంద్రం బేషరతు ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications