వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్చర్యపరుస్తాం: టిపై వాసిరెడ్డి, 5న టిడిపిలోకి ఆదాల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vasireddy Padma
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, అందరు ఆశ్చర్యపోయే ఫలితాలు సాధిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం అన్నారు. సీమాంద్ర సమస్యలు పట్టని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. సీమాంధ్రకు నష్టం జరుగుతుందని తెలిసి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు.

సీమాంధ్ర గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికల అనంతరం థర్డ్ ఫ్రంట్‌లో తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిదే కీలక పాత్ర అన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిని తామే నిర్ణయిస్తామన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని ఆమె చెప్పారు.

చంద్రబాబుతో ఆదాల భేటీ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఆదాల ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. వచ్చే నెల 5న నెల్లూరులో జరగనున్న ప్రజాగర్జన సభలో తాను టిడిపిలో చేరుతానని ఆదాల చెప్పారు. తాను ఎందుకు పార్టీని వీడుతున్నానో ఇప్పటికే చెప్పానన్నారు. తనతో పాటు శ్రీధర్ కృష్ణా రెడ్డి, పొలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు కూడా టిడిపిలో చేరే అవకాశముందన్నారు. మరోవైపు గంటా శ్రీనివాస రావు, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు.

బాధాకరమే కానీ.. తోట

మాజీ మంత్రి తోట నరసింహం గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన బాధాకరమైనప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. కొంతమంది నాయకులు కాంగ్రెస్‌ను వీడినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీలేదని తోట నరసింహం అన్నారు.

కిరణ్‌తో కలిసి పార్టీ: రాయపాటి

కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పార్టీ పెడుతున్నామని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు చెప్పారు. కిరణ్ పార్టీ మెజార్టీ సాధిస్తుందన్నారు. విభజన ఆపేందుకు ప్రయత్నించామని, కాంగ్రెసు పార్టీ దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు.

English summary
YSR Congress Party spokes person Vasireddy Padma on Thursday said their party will contest in all seats in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X