నంద్యాలలో నిలిచిపోయిన వీరసింహారెడ్డి.. టెన్షన్

కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండుగను ముందే తెచ్చారు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలోని మినీప్రతాప్ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమా కొద్దిసేపు నిలిచిపోయింది. తెల్లవారుజామున 5.00 గంటలకే షో ప్రారంభం కాగా.. వివిధ కారణాలవల్ల రెండు సార్లు 45 నిమిషాల పాటు సినిమా ఆగిపోయింది. దీంతో బాలయ్య అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. సాంకేతిక లోపాల కారణంగా అలా జరగడమే కారణమని థియేటర్ నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత సినిమా యథావిధిగా కొనసాగింది.

బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి తెరకెక్కింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య సినిమా అంటే యాక్షన్ కు పెద్దపీట వేస్తారు. ప్రతి పండగకు బాలకృష్ణ సినిమా విడుదలవడం ఆనవాయితీగా వస్తోంది. 2021 డిసెంబర్ లో 'అఖండ'సినిమాతో తెలుగు సినిమాకు ఓ వెలుగును తీసుకువచ్చిన బాలయ్య సినిమా ఏదీ 2022లో విడుదలవలేదు.

Veerasimha Reddy stuck in Nandyala.. Tension

బాలయ్య అభిమానులు ఆయన సినిమా కోసం అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయంలో 2023లో సంక్రాంతి కానుకగా 'వీరసింహారెడ్డి' ప్రజల ముందుకు వచ్చింది. గురువారం విడుదలైన 'వీరసింహారెడ్డి'లో బాలకృష్ణకు బాగా అచ్చివచ్చిన ఫ్యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలసి ఉన్నాయి. పైగా బాలకృష్ణ సినిమా టైటిల్స్ లో 'సింహా' అన్న పదం చోటు చేసుకుంటే సూపర్ హిట్ ఖాయం అనే నమ్మకం అందరికీ ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+