టిక్కెటిచ్చినా బిజెపిలోకి వెల్లంపల్లి, చిరుకు చెప్పకుండానే

కాంగ్రెసు పార్టీ ఆదివారం రాత్రి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉంది. అయితే, ఆయన మాత్రం ఉదయం కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి కమలతీర్థం పుచ్చుకున్నారు.
కాగా, అంతకుముందు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... కేవలం బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన అభిమానంతోనే తాను బిజెపిలో చేరుతున్నట్లు చెప్పారు. రాబోయేది బిజెపి ప్రభుత్వం కనుక సీమాంధ్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలంటే బిజెపిలోనే ఉండాలని భావించానన్నారు.
తన కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కూడా బిజెపిలో చేరాలని సూచించారన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర పిసిసి ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవికి కూడా చెప్పకుండా పార్టీకి గుడ్ బై చెప్పడం కొంత బాధాకరంగా ఉందన్నారు. తప్పని పరిస్థితుల్లోనే బిజెపిలో చేరుతున్నానని, విజయవాడ వెస్ట్ స్థానం నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications