నగదు రహిత సేవలకు పట్టం: వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు. అదో అవినీతి పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు లేవని మన్మోహన్ సింగ్ పై కూడా విమర్శలు గుప్పించారు. ఆయనో అవినీతి రాజుగా పేర్కొన్నారు.
మరోవైపు కరెన్సీ రద్దుపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. త్వరలో నగదు రహిత సేవలను విస్తరిస్తామని చెప్పారు. ఆ క్రమంలో 21 బ్యాంకుల సేవలు అందించే కార్డును త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అంతక ముందు విశాఖ కార్పొరేషన్ పరిధిలో నగదు రహిత సేవలను అందించే సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications